
క్రైమ్ మిర్రర్, జాతీయ న్యూస్:- ప్రస్తుతం మన భారతదేశంలో ట్రాఫిక్ సమస్యలు అనేవి విపరీతంగా ఉన్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. కానీ వీటిపై చర్యలు మాత్రం పెద్ద ఎత్తున అయితే ఏ ప్రభుత్వాలు తీసుకోవట్లేదు. కొత్త కొత్త టెక్నాలజీలు వచ్చినప్పటికీ ట్రాఫిక్ సమస్యలు మాత్రం అంతే ఉండిపోతున్నాయి. ప్రస్తుత కాలంలో మన భారత దేశ వ్యాప్తంగా కొన్ని ముఖ్య నగరాల్లో ప్రయాణించేటువంటి ఒక్కొక్క మనిషి సగటున ఒక సంవత్సర కాలంలో 117 గంటలు ట్రాఫిక్ లోనే గడుపుతున్నట్లుగా ఒక నివేదికలో తాజాగా వెల్లడించడం జరిగింది. ఈ నివేదిక ప్రకారం మన భారతదేశంలోని బెంగళూరు నగరం ట్రాఫిక్ లో మొదటి స్థానంలో నిలిచింది. బెంగళూరులో ప్రయాణం చేస్తున్నటువంటి ప్రతి ఒక్క మనిషి కూడా ఏడాది కాలంలో దాదాపు 120 గంటల పాటు ట్రాఫిక్ లో గడుపుతున్నట్లు తెలిసింది. మరి ఆ వివరాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఒక్కో నగరంలో.. ఒక్కో.. మనిషి సగటున ట్రాఫిక్ లో గడుపుతున్న గంటలు
1. బెంగళూరు – 117 గంటలు
2. కోల్కతా -110 గంటలు
3. పూణే – 108 గంటలు
4. ముంబై -103 గంటలు
5. చెన్నై -94 గంటలు
6. హైదరాబాద్ -85 గంటలు
7. జైపూర్ -83 గంటలు
8. ఢిల్లీ -76 గంటలు
9. అహ్మదాబాద్ -73 గంటలు
మరీ ముఖ్యంగా చెప్పాలంటే పైన పేర్కొన్న ముఖ్య నగరాలలో బెంగుళూరులో అయితే ప్రతి 10 కిలోమీటర్లకు ఒక ప్రయాణికుడికి దాదాపు 34 నిమిషాల 10 సెకండ్లు పడుతుంది. మరోవైపు మన హైదరాబాదులో చూసుకుంటే ప్రతి 10 కిలోమీటర్లకు 31 నిమిషాల 30 సెకండ్లు పడుతుంది. దీన్నిబట్టి మనం అర్థం చేసుకోవచ్చు మన భారతదేశంలో ట్రాఫిక్ సమస్య ఎంతలా పెరిగిపోయింది అనేది. కాబట్టి ఇప్పటికైనా ఈ ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించేలా అధికారులు చూడాలి అని సామాన్య ప్రజలు కోరుతున్నారు.
Read also : డైరెక్టర్ నుంచి హీరోగా… తొలిచిత్రానికే అన్ని కోట్లా?
Read also : ప్రపంచంలోనే బిలీనియర్ల అడ్డాగా మారిన టాప్ 10 నగరాలు ఇవే!





