Homeఆంధ్ర ప్రదేశ్ఈ జిల్లాలకు వడగాలులు ఎఫెక్ట్.. జర జాగ్రత్త!

ఈ జిల్లాలకు వడగాలులు ఎఫెక్ట్.. జర జాగ్రత్త!

క్రైమ్ మిర్రర్,ఆంధ్రప్రదేశ్:- రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా ఎండలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ ఎండల దాటికి ఉద్యోగులు మరీ ముఖ్యంగా వ్యవసాయం చేసేటటువంటి రైతన్నలు బిక్కుబిక్కుమంటూ భయపడుతున్నారు. ఇప్పటికే ఎంతోమంది ఈ మండుతున్న ఎండల కారణంగా వడదెబ్బకు గురవ్వగా ఎంతోమంది ఎండలు దాటికి అలసిపోతున్నారు. మరి కొంతమంది అయితే అసలు బయటకు రావడానికే నిరాకరిస్తున్నారు. ఇక తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎండలు తీవ్ర రూపాన్ని దాల్చుతున్నాయి అని అధికారులు చెబుతున్నారు. నిన్నటి రోజున కడప జిల్లా పొట్టిపాడు లో 40.7 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదయినట్లుగా APSDMA కీలక ప్రకటన వెల్లడించింది.

ఈరోజు వడగాలులు వీచే జిల్లాలు :-
1. మన్యం
2. అల్లూరి సీతారామరాజు
3. పోలవరం
4. శ్రీకాకుళం
5. విజయనగరం
6. ఏలూరు
7. ఎన్టీఆర్

పైన పేర్కొన్న ఏడు జిల్లాలలో విపరీతమైన వర్గాలులు ఇస్తాయి అని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మరియు ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లాలోని ఎనిమిది మండలాల్లో తీవ్రవాడగాలులు, 17 మండలాల్లో మామూలు వడగాలులు ఇస్తాయి అని తెలిపింది. ఇక శుక్రవారం రోజున ఏకంగా 58 మండలాల్లో వడగాలులు వీచే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. కాబట్టి ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దు అని.. ఎవరైనా సరే వడదెబ్బకు గురవుతాయి వెంటనే హెల్ప్ లైన్ నెంబర్లకు కాల్ చేయాలని సూచించారు.

Jeevan Reddy: జీవన్ రెడ్డికి బంపర్ ఆఫర్.. బిఆర్ఎస్ లో సెక్రటరీ జనరల్ పదవి!

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments