క్రైమ్ మిర్రర్ తెలంగాణ బ్యూరో: హైదరాబాద్‌లోని మణికొండ పంచవటి కాలనీలో భూ వివాదానికి సంబంధించి రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో కాల్పులు చోటుచేసుకున్నాయి.
ఆంధ్రప్రదేశ్ మాజీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి సోదరుడు (తమ్ముడు) ప్రభాకర్, అతని అల్లుడు అభిషేక్ గౌడ్ మధ్య ఈ వివాదం జరిగింది. ఘర్షణ సమయంలో, కర్నూలుకు చెందిన కృష్ణ అనే వ్యక్తి గాలిలోకి కాల్పులు జరిపినట్లు స్థానికులు తెలిపారు.
అయితే, ఈ ఘటనపై డీజీపీ కార్యాలయం స్పందిస్తూ, వాస్తవానికి అక్కడ కాల్పులు జరగలేదని, కేవలం గన్‌తో బెదిరింపులకు పాల్పడ్డారని స్పష్టతనిచ్చింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు
Also Read:వికారాబాద్ జిల్లాలో మరో ఘోర రోడ్డు ప్రమాదం…ఒకరు మృతి





