
క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేపటి నుంచి యధా విధముగా గ్రూప్ -2 మెయిన్స్ ఎగ్జామ్స్ జరుగుతాయని ఏపీపీఎస్సీ తెలిపింది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా సోషల్ మీడియాలో గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలు వాయిదా పడ్డాయి అంటూ చాలా ఫేక్ ప్రచారాలు నడుస్తున్నాయని చెప్పుకొచ్చింది. ఎవరైతే సోషల్ మీడియాలో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చెందిస్తున్నారో వారిపై పోలీసులకు ఫిర్యాదు చేయడమే కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. ఇప్పటికే సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. షెడ్యూల్ ప్రకారమే రేపటి నుంచి ఎగ్జామ్ జరుగుతుందని స్పష్టం చేసింది. కాగా రోస్టర్ విధానంలో తప్పులు సరి చేసే వరకు పరీక్షను వాయిదా వేయాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే.
Read More : రాష్ట్ర మహిళా సమాఖ్య సభ్యులకు సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త!..
కాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది యువకులు ఈ విషయంపై గందరగోళంలో ఉన్నారు. రేపు అసలు ఎగ్జామ్ జరుగుతుందా లేదా అనే అపోహతో చాలామంది ఇంట్లోనే ఉండిపోయారు. అయితే తాజాగా వీటిపై ఏపీపీఎస్సీ రేపు షెడ్యూల్ ప్రకారమే టైం కు ఎగ్జామ్ జరుగుతుందని.. కాబట్టి ప్రతి ఒక్కరూ ముందు జాగ్రత్తలు తీసుకొని హాల్ టికెట్ తీసుకుని ఎగ్జామ్స్ సెంటర్లకు వచ్చి ఎగ్జామ్స్ రాయాలని కోరారు. కాగా ఈసారి రోస్టర్ విధానంలో చాలా తప్పులు ఉన్నాయని అవన్నీ కూడా సరి చేయాలని గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళు ధర్నాలు చేయడం కూడా జరిగింది.
Read More : చెత్త పన్ను రద్దు… ఉత్తర్వులు జారీచేసిన ఏపీ ప్రభుత్వం!