Homeజాతీయంఆదిలాబాద్ ఎయిర్‌పోర్టుకు గ్రీన్ సిగ్న‌ల్‌

ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టుకు గ్రీన్ సిగ్న‌ల్‌

  • ఎయిర్‌పోర్టు మాస్ట‌ర్ ప్లాన్ విడుద‌ల‌
  • త్వ‌ర‌లో భూసేక‌ర‌ణ‌
  • ఎయిర్‌పోర్టు ఏర్పాటు తో యువ‌త‌కు ఉపాధి అవ‌కాశాలు
  • ఎంపీ గోడం న‌గేశ్‌

అదిలాబాద్, క్రైమ్ మిర్ర‌ర్‌: ఆదిలాబాద్ జిల్లాకు కొత్త శోభ సంత‌రించుకోనుంది.ఆదిలాబాద్ జిల్లాకు ఎయిర్‌పోర్టు నిర్మాణానికి కేంద్రం గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింద‌ని ఆదిలాబాద్ ఎంపీడీ గోడం న‌గేశ్ అన్నారు. ఈ సంద‌ర్భంగా ఎయిర్‌పోర్టు మాస్ట‌ర్ ప్లాన్‌ను ఎమ్మెల్యే పాయ‌ల్ శంక‌ర్‌తో క‌లిసి విడుద‌ల చేశారు.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న త్వ‌ర‌లోనే భూసేక‌ర‌ణ ప‌నులు చేప‌ట్ట‌నున్న‌ట్లు తెలిపారు. ఎయిర్‌పోర్టు అందుబాటులోకి వస్తే యువ‌త‌కు ఉద్యోగ ఉపాధి అవ‌కాశాలు ల‌భిస్తాయ‌ని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో శంషాబాద్ ఎయిర్‌పోర్ట‌కు ఒక్క‌టే ఉండ‌డంతో మ‌రి కొన్ని ఎయిర్ పోర్టులు ఏర్పాటు చేయాల‌ని కేంద్రానికి విజ్జప్తి చేసింది.

కాగా దీనితో వ‌రంగ‌ల్ మునుగూరు ఎయిర్‌పోర్టు, కొత్త‌గూడెం,రామ‌గుండం, ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింద‌ని తెలిపారు. ఈ ప్రాంతంలో ఇండస్ట్రియల్‌ పార్కు ఏర్పాటుకు మరో 10 వేల ఎకరాల గుర్తింపునకు ప్రభుత్వ యంత్రాంగం చర్యలు తీసుకుంటోందని చెప్పారు.

ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అనేక రంగాల్లో ముందడుగు వేస్తోంద‌న్నారు.స్థానిక ప్రజల దీర్ఘకాల డిమాండ్‌ను నిజం చేయటం కోసం నిరంతర కృషి చేసిన కేంద్ర పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్
కుమార్‌లకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తుట్లుగా తెలిపారు.

 

Most Popular

Recent Comments