తెలంగాణ

క్రీడల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది : నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే

-సీఎం రేవంతే సూపర్ స్పోర్ట్స్ మెన్

-క్రీడలు నాయకత్వ లక్షణాలు పెంపొందిస్తాయ్

-మానసిక ప్రశాంత ఆత్మస్థైర్యం నింపేవి క్రీడలు

-క్రీడల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది

క్రైమ్ మిర్రర్, తెలంగాణ:- క్రీడల
అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో ఆల్ ఇండియా క్రికెట్ టోర్నమెంట్ నిర్వాహకులు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా స్థానిక శాసనసభ్యులు హాజరై నిర్వాహకులకను అభినందిస్తూ క్రీడాకారులను పరిచయం చేసుకొని క్రీడలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడల పట్ల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారని వెల్లడించారు. అందులో భాగంగా క్రీడాకారులను స్ఫూర్తి నింపేందుకు అంతర్జాతీయ ఫుట్ బాల్ క్రీడాకారుడు తో స్వయంగా క్రీడలు ఆడి క్రీడలు అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని చాటి చెప్పారని తెలిపారు. క్రీడలు మానసిక స్థైర్యం తో పాటు ఆరోగ్యాన్ని కూడా ఇస్తుందని తెలిపారు. నియోజకవర్గం లో ఉన్న క్రీడాకారులు జాతీయస్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు. అందుకు తమ సహకారం ఎప్పుడూ ఉంటుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రమణారావు, కౌన్సిలర్లు నిజాం సునీంద్ర శ్రీనివాసులు, సీనియర్ క్రీడాకారులు మరియు క్రీడాభిమానులు క్రీడాకారులు పాల్గొన్నారు

Read also : క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న సీఎం.. అన్ని మతాలు సమానమే?

Read also : మీకు యోగి ట్రీట్మెంట్ కరెక్ట్.. ప్రతిపక్షానికి పవన్ కళ్యాణ్ వార్నింగ్?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button