
క్రైమ్ మిర్రర్,ఆంధ్రప్రదేశ్:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తుఫాన్ కారణంగా మరో ఐదు రోజులపాటు భారీ వర్షాలు దంచి కొడతాయని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. అయితే ఈ తుఫాన్ పై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులతో ఎప్పటికప్పుడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తూ అధికారులకు దిశా నిర్దేశం చేస్తున్నారు. తుఫాను ఎదుర్కోవడానికి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండాలి అని స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడ కూడా ప్రాణ మరియు ఆస్తి నష్టం జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. విద్యార్థులకు సెలవులు పట్ల ఆయా జిల్లా కలెక్టర్లు వాతావరణ పరిస్థితులపై, తుఫాన్ తీవ్రతను బట్టి సెలవులు ప్రకటించుకోవాలని కలెక్టర్లకు సూచించారు. సోషల్ మీడియా వేదికగా ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ఉండాలని సూచించారు.
Read also : కర్నూల్ ఘటన ఎఫెక్ట్.. జర్నీలు వద్దు బాబోయ్ అంటున్న ప్రజలు?
తుఫాను నేపథ్యంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఎక్కడ కూడా విద్యుత్, తాగునీటి సరఫరా వంటి వాటికి అంతరాయం కలగకూడదని తెలిపారు. లోతట్టు ప్రాంత ప్రజలకు ముందుగానే హెచ్చరికలు జారీ చేస్తూ వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కోరారు. ఇప్పటికే తుఫాన్ తీవ్రత ఎక్కువగా ఉన్నటువంటి జిల్లాలకు సెలవులు ప్రకటించగా మరికొన్ని జిల్లాలకు సెలవులపై కలెక్టర్ లే నిర్ణయం తీసుకోవాలని కోరారు. మొబైల్ ఫోన్ నెంబర్లకు ఎప్పటికప్పుడు వాతావరణ పరిస్థితులపై మెసేజ్లు పంపాలని టెలికాం సంస్థలకు ఆదేశాలు జారీ చేశారు. ఈనెల 28వ తేదీన తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది అని… కాబట్టి ఎవరూ కూడా ఈ రెండు రోజులపాటు దూరపు ప్రయాణాలు చేయకూడదని సూచించారు. చిన్నచిన్న నిత్యవసర సరుకులు నుంచి ఏ అవసరం ఏర్పడిన కూడా వెంటనే అత్యవసర హెల్ప్ లైన్ నెంబర్లకు కాల్ చేయాలని సూచించారు. తుఫాన్ ప్రభావం కారణంగా ప్రతి జిల్లా కలెక్టర్ ఎప్పటికప్పుడు ఆ జిల్లాలోని అన్ని మండలాలు అలాగే అన్ని గ్రామాలలో పరిస్థితులను గమనిస్తూ ఉండాలి అని ఆదేశించారు.




