
క్రైమ్ మిర్రర్, సినిమా న్యూస్:- ప్రస్తుత కాలంలో లవర్స్ విడిపోవడం చాలా కామన్ గా మారిపోయింది. ఎన్నో రోజుల నుంచి ప్రేమించుకుంటున్న కూడా ఒక చిన్న సందర్భం తో విడిపోతున్న సందర్భాలు చూస్తున్నాము. అయితే తాజాగా హీరోయిన్ రష్మిక తన రిలేషన్షిప్ బ్రేకప్ గురించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక రిలేషన్ షిప్ లో బ్రేకప్ అయితే అబ్బాయిల కన్నా అమ్మాయిలకి ఎక్కువగా బాధ ఉంటుందని అన్నారు. అమ్మాయిలతో పోలిస్తే అబ్బాయిలు ఎక్కువ బాధపడతారని బయట ప్రచారం జరుగుతున్న కూడా దాన్ని నేను అంగీకరించనని సంచలన వ్యాఖ్యలు చేశారు. సాధారణంగా అబ్బాయిలలా బాధలను వ్యక్తపరిచేందుకు గడ్డాలు పెంచలేము అని, మందు కూడా తాగలేమని… లో లోపలే చాలా కృంగి పోతామని హీరోయిన్ రష్మిక కీలక వ్యాఖ్యలు చేశారు. మనసులో ఎక్కువ బాధ అమ్మాయిలకి ఉంటుందని.. కానీ వాటిని బయటకు చూపించలేరని తాజాగా జరిగినటువంటి ఓ ఇంటర్వ్యూలో ఈమె ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. కాగా గతంలో హీరోయిన్ రష్మికకు బ్రేకప్ అయిన తర్వాత తాజాగా విజయ్ దేవరకొండ తో నిశ్చితార్థం చేసుకున్న విషయం దేశవ్యాప్తంగా తెలిసిన విషయమే. కాగా ఈ హీరోయిన్ రష్మిక నటించినటువంటి ” ది గర్ల్ ఫ్రెండ్ ” అనే సినిమా నవంబర్ 7వ తేదీన రిలీజ్ కానుంది.
Read also : కాంగ్రెస్, బీఆర్ఎస్ ఓకే… ప్రచారంలో బీజేపీ స్పీడ్ పెంచుబోతుందా?
Read also : చాలా చీప్ గా టెస్ట్ టికెట్స్… అది కూడా భారత్ VS సౌత్ఆఫ్రికా మ్యాచ్?