
క్రైమ్ మిర్రర్, సినిమా న్యూస్:- కోలీవుడ్ మాస్ డైరెక్టర్ అయినటువంటి లోకేష్ కనగరాజ్ హీరో అవతారం ఎత్తారు. డైరెక్టర్ నుంచి హీరోగా అవతారమెత్తినటువంటి లోకేష్ కనగరాజ్ తను నటిస్తున్న తొలిచిత్రానికి 30 కోట్ల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటున్నట్లు సినీమా ఇండస్ట్రీలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఖైదీ, మాస్టర్, విక్రమ్, లియో మరియు కూలీలాంటి కొన్ని వందల కోట్ల కలెక్షన్లు రాబట్టిన బ్లాక్ బస్టర్ చిత్రాలకు డైరెక్టర్ గా ఉన్నటువంటి డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ డైరెక్టర్ గానూ 50 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. కానీ హీరోగా కూడా రెమ్యూనరేషన్ విషయంలో ఏమాత్రం తీసిపోలేదు. ఒక డైరెక్టర్ నుంచి హీరోగా మారి తొలి చిత్రానికే 30 కోట్లు తీసుకుంటున్నారు అంటే ఇది మామూలు విషయం కాదు. ఇది ఒక సరి కొత్త రికార్డ్ అనే చెప్పాలి. ‘DC’ అనే చిత్రంలో లోకేష్ కనగరాజ్ హీరోగా కీలకపాత్రలో నటిస్తున్నారు. తాజాగా ఆ సినిమాకు సంబంధించి టైటిల్ గ్లింప్స్ రిలీజ్ చేశారు చిత్ర బృందం. ఈ సినిమాలో హీరోయిన్ గా చంద్రికగా వామికా గబ్బి నటిస్తున్నారు. వచ్చే వేసవికాలంలో ఈ సినిమా రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
Read also : తెలంగాణలోని విద్యార్థులకు చేపల కూర…!
Read also : ప్రపంచంలోనే బిలీనియర్ల అడ్డాగా మారిన టాప్ 10 నగరాలు ఇవే!





