Friday, February 20, 2026
Homeతెలంగాణఈ నెల 22న ఉచిత కంటి వైద్య‌శిబిరం

ఈ నెల 22న ఉచిత కంటి వైద్య‌శిబిరం

చండూరు, క్రైమ్ మిర్ర‌ర్: ఈ నెల 22న ఆదివారం కోమ‌టిరెడ్డి సుశీల‌మ్మ ఫౌండేష‌న్ ఆధ్వ‌ర్యంలో మునుగోడు క్యాంప్ కార్యాల‌యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వ‌హిస్తున్న‌ట్లు చండూరి మున్సిప‌ల్ చైర్మ‌న్ కోడి శ్రీ‌నివాస్‌లు శుక్ర‌వారం ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. ఈ ఉచిత కంటి వైద్య శిభిరం ఉద‌యం 9గంట‌ల నుంచి ప్రారంభ‌మ‌వుతుంద‌ని మండ‌ల ప్ర‌జ‌ల‌తో పాటు చుట్టు ప‌క్క‌ల గ్రామాల ప్ర‌జ‌లు వ‌చ్చి స‌ద్వినియోగం చేసుకోవాల‌ని కోరారు.

50 సంవ‌త్స‌రాల వ‌య‌స్సు పైబ‌డిన వారు విధిగా ఆధార్‌కార్డుతో పాటు మీ ఫోన్ నెంబ‌ర్‌, గ‌తంలో మీరు వాడుతున్న మందుల సీటి తీసుకొని హాజ‌రు కావాల‌ని కోరారు. కంటి శుక్లాల ఆప‌రేష‌న్ అవ‌స‌రం ఉన్న వారిని హైద‌రాబాద్ తీసుకెళ్లి ఆప‌రేష‌న్ చేయించి తీసుకొస్తామ‌ని తెలిపారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments