 
						చౌటుప్పల్ (క్రైమ్ మిర్రర్): యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలో నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యం చోటుచేసుకుంది. చాక్లెట్ ఇస్తామని చెప్పి అమాయక బాలికను మోసం చేసిన ఇద్దరు మధ్యప్రదేశ్ యువకులు ఆమెపై అత్యాచారానికి పాల్పడిన ఘటన స్థానికులను షాక్‌కు గురి చేసింది.
Also Read:మునుగోడులో పోలీస్ శాఖ ఆధ్వర్యములో రన్ ఫర్ యూనిటీ
సమాచారం మేరకు, చిన్నారి ఇంటి సమీపంలో ఆడుకుంటుండగా నిందితులు చాక్లెట్ ఇస్తామని చెప్పి లోపలికి పిలిచారు. బాలిక కేకలు వేయడంతో అప్రమత్తమైన స్థానికులు వెంటనే అక్కడికి చేరుకొని తలుపులు పగలగొట్టి ఆమెను రక్షించారు. అనంతరం కోపంతో ఊగిపోయిన ప్రజలు ఇద్దరు నిందితులను పట్టుకొని పోలీసులకు అప్పగించారు.
Also read:ఖమ్మం సీపీఎం సీనియర్ నేత దారుణ హత్య…
బాలికను తక్షణమే సమీపంలోని ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతోంది. పోలీసులు నిందితులను కస్టడీలోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ చిన్నారుల భద్రతకు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Also Read:ఉక్కు మనిషి ఆశయాలతో – రన్ ఫర్ యూనిటీ
 
				 
					
 
						 
						




