
ఆత్మకూరు,క్రైమ్ మిర్రర్:- యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండలం కేంద్రం ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ గురువారం రోజున దేశ వ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ మండల కేంద్రంలో కార్మిక సంఘాలతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర అధ్యక్షుడు గణపతి రెడ్డి మాట్లాడుతూ దేశంలోని నరేంద్ర మోడీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం దేశ కార్మిక వర్గాన్ని కార్పొరేట్ శక్తులకు బానిసలుగా మార్చే విధంగా 29 కార్మిక చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో 4 లేబర్ కోడ్లను బిజెపి నాయకత్వంలోని మనువాద ప్రభుత్వం తీసుకువచ్చిందని దీనివల్ల కార్మికులు తమ వేతనాల కోసం హక్కుల కోసం సమ్మె చేసే హక్కును ప్రభుత్వము లాక్కుంటుందని తద్వారా కార్మికులు కార్పొరేట్ కంపెనీలకు బానిసలుగా మార్చే విధంగా చూస్తుందని అన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మికులు కర్షకులు ఎస్సీ ఎస్టీ, బీసీ బహుజన వర్గాలపై మనువాద సిద్ధాంతాలను రుద్దుతుందని ఆయన అన్నారు. గురువారం రోజు దేశవ్యాప్తంగా కార్మికులు కర్షకులు నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలబడి పోరాటం సాగిస్తున్నారని ఈ పోరాటాన్ని చూసైనా నరేంద్ర మోడీ ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయకపోతే భవిష్యత్తులో నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్తారని ఆయన ఈ సందర్భంగా అన్నారు.కార్మిక చట్టాలను రద్దుచేసి నాలుగు లేబర్ కోడ్లను అమలు చేయడం వలన దేశంలోని నలభై కోట్ల మంది అసంఘటితరంగా కార్మికులు వారి కుటుంబాలు చితికి పోయేలా చట్టాలు ఉన్నాయని 40 కోట్ల మంది ప్రజల శ్రమ కార్పొరేట్ కంపెనీల ఖజానా నిండుతుందని పేద ప్రజల శ్రమ కార్పొరేట్ కంపెనీల పరం అయ్యే వీలుగా ప్రభుత్వం చట్టాలు చేస్తుందని అన్నారు.కార్మిక కర్షక పేదల వ్యతిరేక చట్టాలు చేస్తున్న నరేంద్ర మోడీ ప్రభుత్వం లేబర్ కోర్టులను రద్దు చేసేంతవరకు కార్మిక వర్గం పోరాటం నిర్వహించాలని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యవర్గ సభ్యులు నోముల స్వామి, కూరెళ్ల కిష్టయ్య, గ్రామపంచాయతీ కార్మికుల మండల అధ్యక్షుడు ఇంద్రపెల్లి జ్ఞానేశ్వర్, మండల కార్యదర్శి రాగటి శ్రీనివాస్, మండల కోశాధికారి కల్వల లక్ష్మయ్య, జిల్లా నాయకులు మేడి యాదయ్య, మండల నాయకులు బోడ రామనర్సయ్య, దేవల స్వామి, సూదగానీ రమేష్, కూరెళ్ల సైదులు, కవిత, లలిత, పద్మ, ఉప్పలమ్మ,యాదమ్మ,తదితరులు పాల్గొని విజయవంతం చేసారు.
Journalist Salma Murder Case: మహిళా జర్నలిస్ట్ హత్య కేసు.. ఎనిమిదేళ్ల తర్వాత బయటపడ్డ అసలు కథ!
Russia vs WhatsApp: రష్యాలో వాట్సాప్ పై బ్యాన్, కారణం ఏంటంటే?









