ఆంధ్ర ప్రదేశ్

వైసీపీ మాజీ ఎంపీ ఆస్తులు వేలం - 310 కోట్లు జప్తు..!

వైసీపీ నేతలను కష్టాలు చుట్టుముడుతున్నాయి. కొందరు కేసులు ఎదుర్కొంటున్నారు. మరి కొందరు ఆర్థిక ఇబ్బందుల్లో పడ్డారు. వైసీపీ మాజీ ఎంపీ అయితే దివాళా తీసినట్టున్నారు. అందుకే వారి ఆస్తులు వేలం వేసే పరిస్థితి వచ్చింది. ఇంతకీ ఎవరా మాజీ ఎంపీ…! ఏమా కథ..!

వైసీపీ నేత, మాజీ ఎంపీ బుట్టా రేణుక. ఆమె ఆస్తులనే వేలం వేస్తున్నారు. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 340 కోట్లకు సంబంధించి ఆస్తులను వేలం వేశారు. అసలు ఏం జరిగిందంటే… కర్నూలు మాజీ ఎంపీ బుట్టా రేణుక ఎల్‌ఐసీ 2018లో… (LIC) అనుబంధ సంస్థ హెచ్‌ఎఫ్‌ఎల్‌ (HFL) నుంచి 310 కోట్ల రూపాయల రుణం తీసుకున్నారు. 15 ఏళ్లలో తిరిగి చెల్లించేలా ఈఎంఐ ఆప్షన్‌ పెట్టుకున్నారు. ఆ డబ్బును బుట్టా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, బుట్టా కన్వెన్షన్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌, మెరిడియన్‌ ఎడ్యుటెక్‌ సర్వీసెస్‌లో పెట్టారు. కొంత కాలం ఈఎంఐలు కూడా సక్రమంగానే కట్టారు. ఆ తర్వాత ఏమైందో ఏమో… ఈఎంఐలు సరిగా చెల్లించలేకపోయారు. దీంతో… ఎల్‌ఐసీ అనుబంధ సంస్థ హెచ్‌ఎఫ్‌ఎల్‌ (HFL) బుట్టా దంపతులకు నోటీసులు జారీ చేసింది. అయినా… వారు అప్పు చెల్లించలేకపోయారు. దీంతో… విషయం ఆస్తుల జప్తు వరకు వచ్చింది.

Also Read : ఉగ్రదాడి నేపథ్యం… తిరుమల వెళ్లే భక్తులకు అలర్ట్!.. అవి తీసుకెళ్తే జైలుకే? 

310 కోట్ల రూపాయలు అప్పుతీసుకుంటే.. అందులో 40 కోట్లు తిరిగి చెల్లించారు బుట్టా రేణుక దంపతులు. ఆ తర్వాత గత ఐదేళ్ల నుంచి ఈఎంఐలు చెల్లించలేదు. దీంతో… ఇప్పుడు వడ్డీతో కలిసి 340 కోట్లు అయ్యింది. ఇది తీరాలంటే నెలకు 3 కోట్ల 40 లక్షలు చెల్లించాల్సి ఉంది. వడ్డీ భారం పెరిగిందని.. కొన్ని ఆస్తులు అమ్మి రుణాన్ని రీషెడ్యూల్‌ చేయాలని బుట్టా దంపతులు బ్యాంకు ప్రతినిధులను కోరారు. అయితే… ఆ ప్రతిపాదన వర్కౌట్‌ కాలేదు. దీంతో బుట్టా రేణుక ఆస్తులు జప్తు చేయాలని లోన్‌ ఇచ్చిన సంస్థ నిర్ణయించింది. కేసు కూడా నమోదు చేశారు.

Also Read : రెండు రాష్ట్రాల్లో.. ఈ 13 ప్రదేశాల ప్రజలు జాగ్రత్త!.. ఎప్పుడైనా దాడులు జరిగే అవకాశం?

ఇప్పటికే.. బంజారాహిల్స్‌లో బుట్టా రేణుక దంపతులకు చెందిన 5వేల గజాల భూమిని వేలం వేసే ప్రయత్నం చేశారు. ఆ భూమి విలువ 145 కోట్ల రూపాయలు. ఆ తర్వాత.. మాదాపూర్‌లోని 7వేల 205 గజాల బుట్టా కన్వెన్షన్‌ను కూడా వేలానికి పెట్టారు. దీని విలువ కూడా భారీగా ఉంది. అయితే… ఈ రెండు ఆస్తులను కొనేందుకు మాత్రం ఎవరూ ముందుకు రాలేదు. మంచి డిమాండ్‌ ఉన్న భూములు వేలానికి ఎవరూ ముందుకు రాకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అయినా… అప్పు ఇచ్చిన సంస్థ ఊరుకోవడం లేదు. మరోసారి ఈ రెండు ఆస్తులను వేలానికి పెడుతుంది. మరి… ఈసారైనా వాటిని కొనుక్కునేందుకు ఎవరైనా ముందుకు వస్తారా…? లేదా…? అనేది చూడాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button