క్రైమ్ మిర్రర్ తెలంగాణ బ్యూరో: తెలంగాణలో మధ్యాహ్న భోజన పథకంలో విద్యార్థులకు చేపలు అందించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో చేపల కూర ను చేర్చాలని ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.
ఇందుకు సంబంధించి మత్స్య ఫెడరేషన్ కసరత్తు చేస్తున్నట్లు కూడా తెలుస్తోంది. మొత్తం విద్యార్థులు ఎంత మంది ఉంటారు.. వారికి ఎన్ని రోజులు చేపల కూర వడ్డించాలి.. ఒక్కొక్కరికి ఎన్ని గ్రాముల చేపలు అవసరం.. పిల్లలందరికీ కలిపి ఎంత మొత్తంలో చేపలు అవసరం అవుతాయి.. ఇందుకు నిధుల సమీకరణ ఎలా అనే అంశంపై అధికారులు లెక్కలు వేస్తున్నట్లు సమాచారం.
ఈ కసరత్తు ఓ కొలిక్కి రాగానే ప్రభుత్వానికి నివేదిక అందించనున్నారు. అనంతరం ప్రభత్వం నిర్ణయం ప్రకారమే నడుచుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read:నటుడు నాగార్జున,అతని కుటుంబానికి క్షమాపణలు-మంత్రి కొండా సురేఖ
Also Read:బ్రేకింగ్ న్యూస్.. డిశ్చార్జ్ అయిన నటుడు ధర్మేంద్ర!





