
క్రైమ్ మిర్రర్,తెలంగాణ:- తెలంగాణ రాష్ట్రంలో తొలి దశ పంచాయతీ ఎన్నికలు ముగిసాయి. ఈ సందర్భంలోనే బిఆర్ఎస్ పార్టీ చేసిన ట్వీట్ వైరల్ అవుతుంది. తొలి దశ పంచాయతీ ఎన్నికల ఫలితాలు అధికార కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చాయి అని బీఆర్ఎస్ పార్టీ తాజాగా ట్వీట్ చేసింది. గులాబీ జెండా పల్లె పల్లెల్లో దుమ్మురేపింది అని తెలిపింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బిఆర్ఎస్ పార్టీ ప్రభంజనం మొదలైంది అని ఇక కాంగ్రెస్ పార్టీకి చేదు జ్ఞాపకాలే మిగులుతాయి అని పేర్కొంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న కనీసం సగం స్థానాలు కూడా గెలవలేకపోయింది అని.. అధికార పార్టీకి ఎదురుగాలి తప్పలేదు అని పేర్కొంది. అంతేకాకుండా గత 10 సంవత్సరాలలో మేము అధికారంలో ఉన్నప్పుడు మొదటి విడతలో మా పార్టీ 64% సీట్లు గెలిస్తే ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కేవలం 44% సీట్లు మాత్రమే గెలిచిందని ట్వీట్ చేసింది.
Read also : తిరుమల భక్తులకు పండగే పండగ.. ఇలా చేస్తే ఉచితంగా డబ్బులు
కాగా ఇప్పటికే ఒకవైపు కాంగ్రెస్ పార్టీ 2000కు పైగా స్థానాల్లో విజయం సాధించగా, టిఆర్ఎస్ పార్టీ 1100కు పైగా స్థానాలలో విజయం సాధించింది. దీంతో ఎక్కువ స్థానాలలో మనోళ్లే గెలిచారు అని కాంగ్రెస్ పార్టీ సెలబ్రేషన్స్ చేసుకుంటుండగా, గతం నా ప్రభుత్వంలో మేము సగం గెలిచినట్లు కాంగ్రెస్ గెలవలేకపోయింది అని టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. ఇక ఇదే జోష్లో రెండో విడతలో కూడా టిఆర్ఎస్ పార్టీ ప్రతిపల్లెలోనూ కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇస్తుంది అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కానీ మరోవైపు కాంగ్రెస్ పార్టీ మాత్రం రెండో విడతలోనూ అత్యధిక స్థానాల్లో విజయం సాధిస్తామని అంటుంది. ఏది ఏమైనా కూడా ఈ పంచాయతీ ఎన్నికలు మాత్రం రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఒక్క రాజకీయ నాయకుడితో పాటు ప్రతి ఒక్క సామాన్య ప్రజల్లో కూడా ఉత్కంఠత నెలకొన్నాయి. ఒక సర్పంచ్ గా గెలవడానికి ఎమ్మెల్యే స్థాయిలో హామీలు కూడా ఇస్తున్నారు. కాగా ఇప్పటికే జరిగిన మొదటి విడత పంచాయతీ ఎన్నికలలో ఎన్నో వింతలు, అద్భుతాలు జరిగే విజయాలు సాధించిన సందర్భాలు చూశాం.
Read also : Health Tips: మలబద్ధకం ఎక్కువగా ఉందా..? అయితే ఇలా చేయండి..





