తెలంగాణ

జనవరి 10న మున్సిపల్ ఓటర్ల తుది జాబిత

చండూరు, క్రైమ్ మిర్రర్:- రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సన్నాహాలు మొదలుపెట్టింది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని 117 మున్సిపాలిటీలో జనవరి 10న ఓటర్ల తుది జాబితాను ప్రకటించనున్నారు. జనవరి 1న పోలింగ్ స్టేషన్ల వారిగా ముసాయిదా ఓటర్ల జాబితాలను నోటీస్ బోర్డుల పైన ప్రచురించనున్నారు. ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయమని ఓటర్లను కోరుతారు. జనవరి 10న పోలింగ్ స్టేషన్ల వారిగా తుది జాబితాలను ప్రచురించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం మున్సిపల్ కమిషనర్లకు ఆదేశాలు ఇచ్చింది. ఇప్పటికే అన్ని మున్సిపాలిటీలో ఎన్నికల నిర్వహణకు కావలసిన ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు. చండూరు మున్సిపాలిటీలో 10 వార్డులు ఉన్నాయి. జనవరి 10 ఓటర్ల తుది జాబితా వెలువరించనున్నారు. జనవరి 1న ఓటర్లు మున్సిపాలిటీ నోటీస్ బోర్డ్ పైన తమ ఓటును సరి చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే చండూరులో ఎన్నికల సందడి మొదలైంది. ఆశావాహులు ఇప్పటికే హడావిడి మొదలుపెట్టారు. ఆయా పార్టీలోని ఆశావాహులు తమకే టికెట్ వచ్చేలా పావులు కదుపుతున్నారు.

Read also : Unnao Rape Case: ఉన్నావ్‌ అత్యాచార కేసు, సెంగార్‌కు సుప్రీంకోర్టు షాక్!

Read also : Aravalli mining: ఆరావళి మైనింగ్‌.. సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button