
క్రైమ్ మిర్రర్,స్పోర్ట్స్ న్యూస్:- మహిళల ప్రపంచ కప్పు నెగిన తర్వాత యావత్ భారతదేశం అంతటా కూడా మహిళల జట్టు పై ప్రశంసలు కురిపించిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే వరల్డ్ కప్ లో భారత మహిళల జట్టు విజయం పొందిన తరువాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రత్యేకంగా జట్టు మొత్తాన్ని కూడా విందుకు ఆహ్వానించారు. నేడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మహిళలతో ముచ్చటిస్తున్న సమయంలో మహిళల నుంచి మోడీకి కొన్ని ఇంట్రెస్టింగ్ క్యూస్షన్స్ ఎదురయ్యాయి. మోడీజీ మీరు ఇంతలా మెరిసిపోతున్నారు.. ఇంతకీ మీ స్కిన్ కేర్ రొటీన్ ఏంటి అని భారత మహిళా బ్యాటర్ హర్లీన్ డియోల్ ప్రశ్నించారు. అయితే ఆమె అడిగిన ప్రశ్నను వినగానే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిరునవ్వు చిందించారు. మోడీజీ సమానం ఇచ్చే లోపే.. స్నేహారానా అనే మరో ప్లేయర్ మధ్యలో కలుగాచేసుకుని దేశ ప్రజల ప్రేమ వల్లే నరేంద్ర మోడీజీ గారి స్కిన్ అంతలా మెరిసిపోతుంది అని చెప్పుకొచ్చారు. అయితే స్నేహారాన చెప్పినటువంటి ఈ సమాధానం పట్ల నరేంద్ర మోడీ సైతం ఏకీభవించారు. దీంతో భారత మహిళల పట్ల ప్రధానమంత్రి ఇంత చురుకుదనాన్ని పాటించడం మెచ్చుకోవాల్సిన విషయమే. ఒక దేశ ప్రధాని మంత్రి హోదాలో ఉండి తోటి మహిళా క్రికెటర్లతో ఇలా ఆనందంగా గడపడం పట్ల ప్రతి ఒక్కరు కూడా మోడీని ప్రశంసిస్తున్నారు. అనంతరం పీఎం నివాసంలోనే మహిళా క్రికెటర్లందరికి కూడా విందు ఏర్పాటు చేశారు.
Read also : చండూరులో పోలీసులపై దాడి…!
Read also : కీలక పదవుల్లో ఉన్న నాయకులు.. ఇలానా మాట్లాడేది : నెటిజన్లు ఆగ్రహం





