క్రైమ్ మిర్రర్ తెలంగాణ ఇన్వెస్టిగేషన్ బ్యూరో: తెలంగాణా రాష్ట్రము లో సాగు పనులు ముమ్మరం కావడంతో రాష్ట్రవ్యాప్తంగా యూరియాకు ఒకేసారి డిమాండ్ పెరిగింది. కొన్ని ప్రాంతాలకు స్టాక్ సకాలంలో చేరుకోకపోవడం వల్ల కొరత ఏర్పడి, రైతులు గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉండాల్సి వస్తోంది.
రద్దీ ఎక్కువగా ఉండటం మరియు తోపులాటలు జరగకుండా ఉండేందుకు అధికారులు పోలీస్ స్టేషన్లలో లేదా పోలీసుల పర్యవేక్షణలో పంపిణీ చేస్తున్నారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు (PACS) లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన డీలర్ల వద్ద మాత్రమే ఎరువులు తీసుకోవాలి.
యూరియా పొందేందుకు రైతులు తమ ఆధార్ కార్డు మరియు పట్టాదారు పాస్ పుస్తకం వెంట తీసుకెళ్లాలి. ఒకేసారి యూరియా వేయడానికి బదులు, ద్రవ రూపంలో ఉండే నానో యూరియా వాడకాన్ని పరిశీలించాలని వ్యవసాయ నిపుణులు రైతులకు సూచిస్తున్నారు.





