క్రైమ్ మిర్రర్ తెలంగాణ బ్యూరో: ఈ ఏడాది తెలంగాణ రాష్ట్రంలో అధిక వర్షపాతం నమోదు కావడంతో చలి తీవ్రత గణనీయంగా పెరిగింది. ఉత్తర, ఈశాన్య దిశల నుంచి వీస్తున్న చలి గాలుల ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 5 డిగ్రీల సెల్సియస్ వరకు పడిపోయాయి.
ఉత్తర భారతం నుండి చల్లని గాలులు వీయడం చలి తీవ్రత పెరగడానికి ప్రధాన కారణాలు. నవంబర్ 9, 2025న రాజన్న సిరిసిల్లలోని రుద్రంగిలో అత్యల్పంగా 10.2°C కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. హైదరాబాద్ విశ్వవిద్యాలయం పరిసరాల్లో 13.4°C నమోదైంది.
Also Read:ప్రపంచవ్యాప్తంగా ప్రకృతి ప్రళయతాండవం.. మన దేశంలోనే 80వేల మంది మృతి!
రాబోయే కొద్ది రోజుల్లో చలి మరింత పెరిగే అవకాశం ఉందని, నవంబర్ 13 నుండి 17 మధ్య ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువకు పడిపోయే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా ఆదిలాబాద్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల వంటి ఉత్తర తెలంగాణ జిల్లాల్లో చలి ప్రభావం ఎక్కువగా ఉంది.
కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ అయింది. ప్రజలు చలి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు చలి నుండి రక్షణ పొందేందుకు వెచ్చని దుస్తులు ధరించాలని అధికారులు సూచిస్తున్నారు.
Also Read:నిన్న విజయ్ దేవరకొండ.. నేడు ప్రకాష్ రాజ్.. బెట్టింగ్ యాప్స్ కేసులో విచారణ?





