జ‌గ‌న్ చెప్పెవ‌న్ని శ్రీ‌రంగ నీతులే

  • పోలీసులు లేకుండా బయటకు రాగలరా…
  • మంత్రి కొల్లు రవీంద్ర సూటి ప్రశ్న

మచిలీపట్నం, క్రైం మిర్ర‌ర్ః

ఆంధ్ర‌ప్ర‌దేశ్ మాజీ ముఖ్య‌మంత్రి, వైసీపీ అధినేత జ‌గన్‌మోహ‌న్ రెడ్డి నోరిప్పితే శ్రీ‌రంగ‌నీతులే కాని పోలీసులు లేకుండా బ‌య‌ట‌కు రాగ‌ల‌రా అని మంత్రి కొల్లు ర‌వీంద్ర సూటిగా ప్ర‌శ్నించారు.

కృష్ణాజిల్లా మచిలీపట్నంలో గురువారం జరిగిన అన్న క్యాంటీన్ ప్రమాణ స్వీకారోత్సవానికి ఎక్సైజ్ గనులు భూగర్భవన‌రుల‌శాఖ మంత్రి కొల్లు ర‌వీంద్ర హాజ‌రయ్యారు.

అనంత‌రం ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ రాష్ట్రంలో రాక్ష‌స సంస్కృతికి తెర‌లేపి ఇప్ప‌డు నీతులు చెప్పే క‌నీస అర్హ‌త ద‌న్నారు.

ఆయన చెప్పేవి శ్రీరంగనీతులు చేసేది ఏదో అన్నట్టుగా రాష్ట్ర ప్రజలు భావిస్తున్న సంగతి ఆయనకు తప్ప అందరికీ తెలుసు అన్నారు. ఆడబిడ్డలను అవమానించడం వైసిపి నాయకులకు వెన్నతో పెట్టిన విద్యగా ఉందన్నారు.

ఇలాంటి నాయకులకు ఈ భూమండలం మీద నడిచే అర్హత లేదన్నారు. వారిలో జగన్మోహన్ రెడ్డి ముందు వరుసలో ఉంటారన్నారు.

సీఎం చంద్రబాబుపై ఇష్టారాజ్యంగా నోరు పారేసుకున్న అంబటి రాంబాబు పై తెలుగుదేశం పార్టీకి చెందిన వారే కాకుండా ప్రజలందరూ ఆగ్రహం వ్యక్తం చేశారన్నారు.

పోలీసులు లేకపోతే అంబటి రాంబాబు ఏమైపోయేవారో తెలుసుకోవాలన్నారు. అంబటి రాంబాబే కాదు పోలీసులు లేకుండా జగన్ రెడ్డి బయటకు రాగలరా అని మంత్రి రవీంద్ర ఈ సందర్భంగా ప్రశ్నించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button