Homeఅంతర్జాతీయంవెంటనే టెహ్రాన్ ను ఖాళీ చేయండి, ట్రంప్ వార్నింగ్!

వెంటనే టెహ్రాన్ ను ఖాళీ చేయండి, ట్రంప్ వార్నింగ్!

Israel- Iran Tensions: ఇజ్రాయెల్-ఇరాన్ భీకర దాడుల నేపథ్యంలో అమెరికా ఎంట్రీ ఇచ్చింది. రాజధాని టెహ్రాన్ ను వెంటనే ఖాళీ చేయాలంటూ ఇరాన్ ప్రజలకు ట్రంప్ సూచించారు. అణు ఒప్పందం మీద ఇరాన్ సంతకం చేసి ఉండాల్సిందని, అలా చేయకపోవడం వల్లే ఇప్పుడు ఆ దేశ పౌరులు ప్రాణాలు కోల్పోయే పరిస్థితి తలెత్తిందన్నారు. పరిస్థితి మరింత తీవ్రతరం కాకముందే ఇజ్రాయెల్ తో సమస్యను పరిష్కరించుకోవాలన్నారు. కెనడాలో జరుగుతున్న జీ7 సమ్మిట్ లో పాల్గొనేందుకు వెళ్లిన ట్రంప్.. ఇరాన్- ఇజ్రాయెల్ యుద్ధం మీద కీలక వ్యాఖ్యలు చేశారు.

ఆ రోజే ఇరాన్ సంతకం చేసి ఉండాల్సింది!

తాను చెప్పిన రోజే అణు ఒప్పందం మీద ఇరాన్ సంతకం చేసి ఉండాల్సిందన్నారు ట్రంప్. “నేను చెప్పిన సమయంలోనే అణు ఒప్పందం మీద సంతకం చేసి ఉండాల్సింది. ఇప్పుడు ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇది చాలా సిగ్గుమాలిన చర్య. ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేయలేదు. ఇప్పటికే చాలాసార్లు చెప్పా. అందరూ టెహ్రాన్ ను ఖాళీ చేయాలి” అని తన సొంత సోషల్ మీడియా ట్రూత్ ద్వారా వెల్లడించారు.

నెతన్యాహూ ఇలా.. ట్రంప్ అలా..

ఇరాన్‌ అధినేత ఖమేనీ అంతమొందిస్తేనే, ఇరు దేశాల మధ్య యుద్ధం త్వరగా ముగుస్తుందని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ ప్రకటించాడు. తాజాగా ట్రంప్ టెహ్రాన్ ను ఖాళీ చేయాలని చెప్పడం పరిస్థితి మున్ముందు మరింత తీవ్రంగా మారబోతున్నట్లు అర్థం అవుతోంది. అంతకు ముందు ఇజ్రాయెల్ తో రుగుతున్న యుద్ధంలో ఇరాన్ గెవలేదని ట్రంప్ తేల్చి చెప్పారు. పరిస్థితి మించిపోకముందే రెండు దేశాలు చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలన్నారు. అమెరికా ఆస్తులపై ఇరాన్ ప్రతికార దాడుదలకు పాల్పడకూడదని హెచ్చరించారు. ఇరాన్ తమ ఆస్తులపై ఏ రూపంలో దాడులకు పాల్పడినా తీవ్ర పరిణామాలు ఎదుర్కొనే అవకాశం ఉందన్నారు. గతంలో ఎన్నడూ చూడని రీతిలో అమెరికా సాయుధ దళాలు ఇరాన్‌పై విరుచుకుపడుతాయన్నారు. మరోవైపు ఇరు దేశాలు ఒకదానిపై మరొకటి తీవ్ర దాడులు చేసుకుంటున్న నేపథ్యంలో ప్రపంచ దేశాలు ఈ యుద్ధంలో భాగస్వామ్యం అయ్యే ప్రయత్నం చేస్తున్నాయి.

Read Also: ప్రధాని మోదీ పర్యటన చరిత్రాత్మకం.. సైప్రస్ ప్రెసిడెంట్ నికోస్!

Anjibabu Chittimalla
Anjibabu Chittimallahttps://crimemirror.com/
గత 16 సంవత్సరాలుగా మీడియా రంగంలో పని చేస్తున్నాను. ABN ఆంధ్రజ్యోతి, టీ-న్యూస్‌, వెలుగు దినపత్రిక, V6 చానెల్ లో జర్నలిస్టుగా పని చేశాను. 2022 నుంచి 2024 వరకు ‘ABP దేశం’కు ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పని చేశాను. BIG TVకి ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా ట్రావెల్, వైరల్, లైఫ్ స్టైల్, టెక్ అండ్ సైన్స్, ఆటో, క్రైమ్ వార్తలు అందించాను. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నాను.

Most Popular

Recent Comments