
మునుగోడు, క్రైమ్ మిర్రర్ :- వాహనాలు నడిపే ప్రతి ఒక్కరు మందు తాగి వాహనాలు నడుపరాదు అని చండూరు సి ఐ ఆదిరెడ్డి అన్నారు. మునుగోడు పొలీస్ శాఖ మరియు ఆధ్వర్యములో అంబేద్కర్ చౌరస్తాలో అధిక వడ్డీలు,సైబర్ నేరాలు,దొంగతనాలు, చైన్ స్నాచింగ్,ఆన్లైన్ బెట్టింగ్,మరియు డ్రంక్ అండ్ డ్రైవ్, హెల్మెట్ మొదలగు అంశాలపై ఎస్సై ఇరుగు రవి కుమార్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ముఖ్య అతిథిగా చండూరు సిఐ ఆదిరెడ్డి పాల్గొని ప్రజలకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సోషల్ మీడియాలు చూసి అనవసరమైన యాప్లు ఓపెన్ చేసి యువత సైబర్ నెరగాలవలలు పడుతున్నారన్నారు తక్కువ వడ్డీకి ఎక్కువ లోన్లు ఇప్పిస్తాం ఇప్పిస్తామని ఆశ చూపించి అని ఆశ చూపించి మోసాలకు పాటుపడున్నారని అలాంటి నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అందుబాటులో వున్న పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించాలి.
Read also : ఎమ్మెల్యే మేఘారెడ్డి ప్రత్యేక చొరవ.. వనపర్తి మునిసిపాలిటీకి రూ.18.70 కోట్ల యూఐడిఫ్ నిధులు!
భవిష్యత్ నేరాలను ఎక్కువగా అంతర్జాలం ఆధారంగానే జరుగుతాయని,సమాజ అభివృద్ధికోసం పనులు సులువుగా కావటం కోసం ఉపయోగించాల్సిన అత్యాధునిక సాంకేతికతను కొందరు నేరస్తులు తమ స్వలాభం కోసం అమాయక బాధితులను రకరకాల మార్గాల్లో మోసం చేసి, దోచుకోవడం కోసం అమాయక స్త్రీలను వేధించడం కోసం తప్పుడు మార్గాల్లో ఉపయోగిస్తున్నారని తెలిపారు. మద్యం తాగి వాహనం నడపడం ద్వారా వాహనంపై నియంత్రణ కోల్పోయి ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. దీని వల్ల ఇతరుల ప్రాణాలకు ప్రమాదం జరుగుతుందని,ప్రతి ఒక్కరు హెల్మెట్ వాడటం ద్వారా మరణాలను నివారించడం కోసం సహాయపడుతుందని,ప్రతి ఒక్కరు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని,మద్యం సేవించి వాహనాలు నడుపరాదని సూచించారు.ట్రాఫిక్ సంబంధించిన,మరియు పలు అంశాలపై అవగాహన కల్పించారు. పోలీస్ శాఖ అధికారులు సిబ్బంది,మండల ప్రజలు పాల్గొన్నారు.
Read also : టీమిండియాకు బిగ్ షాక్… ICUలో స్టార్ క్రికెటర్!





