
క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్ :- మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 2024 ఎన్నికలు జరిగిన తర్వాత దాదాపుగా నాలుగుసార్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అడుగు పెట్టారు. వచ్చారు.. కొన్ని అభివృద్ధి పనులు చేయడానికి శంకుస్థాపనలు చేశారు… వెళ్ళిపోతున్నారు. ప్రతిసారి ఇంతే జరుగుతుంది కానీ… జగన్ పేరు మాత్రం నరేంద్ర మోడీ ఒక్కసారి కూడా లేవనెత్తలేదు. జగన్ సర్కార్ గురించి ఒక మాట కూడా మాట్లాడకపోవడం కూటమి పార్టీలో ప్రస్తుతం ఈ అంశం చర్చనీయాంశంగా మారిపోయింది. మొదటిసారి చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి వచ్చారు. ఇక రెండవసారి ఏపీ రాజధాని అమరావతి పనుల శంకుస్థాపనకు వచ్చారు. మూడవసారి యోగా డే సందర్భంగా విశాఖపట్నానికి వచ్చారు. ఇక నిన్న జరిగినటువంటి కర్నూల్ సభకు కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హాజరయ్యారు. ఇలా మొత్తంగా నాలుగు సార్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నరేంద్ర మోడీ వచ్చారు. కానీ వచ్చిన ప్రతిసారి కూడా జగన్ మోహన్ రెడ్డి పేరు ఎత్తలేదు. కానీ ఇదే సందర్భంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అలాగే లోకేష్ పై ప్రశంసలు కురిపించారు. ఇదే సమయంలో జగన్ పాలన పై ఒక మాట కూడా అనకపోవడంతో ఒకవైపు టీడీపీ మరోవైపు జనసేన పార్టీలో కూడా గందరగోళం నెలకొంది. అయితే మరోవైపు జగన్ ఎప్పుడు కూడా మోడీని డైరెక్ట్ గా ఎదిరించడానికి సాహసం చేయలేదు. దీని మీద రకరకాలుగా కామెంట్లు వస్తున్న కూడా… ఎవరి వ్యూహం వాళ్లకుంటుందని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. ఇదే అసలు రాజకీయమని.. భవిష్యత్తులో రాజకీయాలు ఎలా ఉంటాయనిది అర్థం కావు కాబట్టి.. మోడీ కూడా జగన్ ను కదిలించట్లేదు అని మిగతావారు భావిస్తున్నారు.
Read also : “తెలుసు కదా”.. ఆహా మరో హిట్ అయ్యిందా?.. రివ్యూ ఇదే!
Read also : ఇదే నా చివరి దీపావళి.. ప్రతి ఒక్కరిని ఏడిపించే ఘటన?