-
ర్యాలీలకు, బహిరంగ సభలకు అనుమతులు పొందాలి
-
డిఎస్పీ వెంకటేశ్వర్లు
మహబూబ్ నగర్, క్రైం మిర్రర్ః
మున్సిపల్ ఎన్నికల్లో పోటిలో ఉన్న అభ్యర్థులందరూ ఎన్నికల నియామవళిని పాటించాలని డీఎస్‌పీ వెంకటేశ్వర్లు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్, భూత్పూర్, దేవరకద్ర మున్సిపాలిటీల పరిధిలో పోటీ చేస్తున్న అభ్యర్థులందరూ ప్రచార నిమిత్తం వినియోగించే వాహనాలకు సంబంధించి ముందుగా సంబంధిత మున్సిపల్ కమిషనర్ అనుమతి తీసుకోవాలని కోరారు.
ర్యాలీ, మైక్ పర్మిషన్,బహిరంగ సభలకు సంబంధించి అనుమతులు మహబూబ్‌నగర్, డీఎస్పీ కార్యాలయంలో పొందాలని స్పష్టం చేశారు.
అనుమతులు లేకుండా బహిరంగ సభలు, మైక్‌లతో ప్రచారం నిర్వహించరాదని హెచ్చరించారు.
లేని యెడల ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం చట్టరీత్య కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
అభ్యర్థులందరూ ఎన్నికలు శాంతియుతంగా, నిబంధనల ప్రకారం జరిగేలా పోలీసుశాఖకు సహకరించాలని కోరారు.





