
Earthquake In Turkey: భారీ భూకంపంతో టర్కీ వణికింది. బలికెసిర్ ప్రావిన్సులో ఒక్కసారిగా భూమి కంపించింది. కొన్ని సెకెన్ల పాటు భూప్రంకపనలు కొనసాగాయి. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.1గా నమోదైంది. బలికెసిర్ ప్రావిన్సులో భూకంపం వచ్చిన సమయంలోనే 200 కిలోమీటర్ల దూరంలోని రాజధాని ఇస్తాంబుల్ లో కూడా భూమి కంపించింది. మొత్తం టర్కీ అంతగా భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఒక్కసారి టర్కీ ప్రజలందరూ భయాందోళనలకు గురయ్యారు. పలు ప్రాంతాల్లోని ప్రజలు భయంతో బయటకు పరుగులు తీశారు.
సిందిర్గిలో భారీ భవనాలు నేలమట్టం
భారీ భూకంపం ధాటికి సిందిర్గి నగరం లోని భారీ భవనాలు నేలమట్టం అయ్యాయి. శిథిలాల కింద చిక్కుకుని 29 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఓ యువతి ప్రాణాలు కోల్పోయింది. డిజాస్టర్ రెస్పాన్స్ టీమ్స్ ప్రస్తుతం శిథిలాలను తొలిగించే పనిలో నిమగ్నమయ్యారు. శిథిలాల కింద ఇంకా జనాలు చిక్కుకుని ఉంటారని అనుమానిస్తున్నారు. వీలైనంత త్వరగా శిథిలాలను తొలగించేందుకు సహాయక బృందాలు శరవేగంగా పని చేస్తున్నాయి.
గత నెలలోనూ టర్కీలో భూకంపం
వాస్తవానికి టర్కీలో తరచుగా భూకంపాలు వస్తుంటాయి. గత నెలలో కూడా టర్కీలో భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్ మీద 5.8గా నమోదలయ్యింది. ఈ భూకంపం ప్రభావంతో ఒకరు మరణించగా, 69 మంది గాయపడ్డారు. గత కొద్ది వారాలుగా పలు దేశాల్లో భూకంపాలు కొనసాగుతున్నాయి. తాజాగా రష్యాలో సంభవించిన భారీ భూకంపం ధాటికి సునామీ వచ్చింది. రష్యా, జపాన్ తీరాలు సునామీ ముప్పను ఎదుర్కొన్నాయి. ఇక టర్కీలో 2023లో భారీ భూకంపం సంభవించింది. ఈ భారీ భూకంపం కారణంగా దాదాపు 53 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. భూకంపం ధాటికి పురాతన నగరం ఆంటియోక్ సర్వనాశనమైంది. తాజాగా మరోసారి అంతకు మించిన తీవ్రవతో భూకంపం వచ్చింది. త్వరలోనే ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలను టర్కీ అధికారులు వెల్లడించే అవకాశం ఉంది.
Read Also: మేం మునిగితే.. సగం ప్రపంచాన్ని నాశనం చేస్తాం: పాక్ ఆర్మీ చీఫ్