
క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్ :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల ప్రజలు విజయవాడకు బయలుదేరారు. ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకోవడానికి భారీగా భక్తులు తరలివస్తున్నారు. నేటి నుంచి కనకదుర్గమ్మ అమ్మవారి దసరా నవరాత్రులలో భాగంగా ఉత్సవాలు ప్రారంభం అవడంతో భారీగా భక్తులు తరలివచ్చి అమ్మవారి దర్శనం చేసుకుంటున్నారు. భక్తుల రాకతో కనకదుర్గమ్మ దేవాలయం కిటకిటలాడిపోతుంది. తొలి రోజు కనకదుర్గమ్మ అమ్మవారు బాల త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనం ఇచ్చారు. ఈ పది రోజులు కూడా వివిధ రకాల రూపాల అలంకారణతో అమ్మవారు దర్శనం ఇస్తుంది కాబట్టి ఈ పది రోజులు కూడా విజయవాడ మొత్తం భక్తులతో నిండిపోతుంది. ఇప్పటికే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశామని ఆలయ అధికారులు చెప్పుకొచ్చారు. వచ్చినటువంటి భక్తులకు ఉచితంగా ప్రసాదం అలాగే నీరు మరికొన్ని ఆహారాలను అందజేయనున్నామని తెలిపారు. నేటి నుంచి మొదలుకొని అక్టోబర్ రెండవ తేదీ వరకు కూడా ఘనంగా అమ్మవారి ఉత్సవాలు జరుగుతాయని.. కాబట్టి పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారిని దర్శించుకోవాలని ఆలయ అధికారులు తెలిపారు. ఇప్పటికే విజయవాడ నగరం అంతా కూడా అమ్మవారి ఆలయంతో పాటుగా ఫ్లై ఓవర్స్ అన్నీ కూడా రంగురంగులుగా.. పండుగ వాతావరణం కనపడేలా అధికారులు ఏర్పాటు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా నేటి నుంచి దసరా పండుగ రోజు వరకు కూడా అన్ని దేవాలయాలు భక్తులతో కిటకిటలాడనున్నాయి. ఇసుకేస్తే రాలనంత జనం గుళ్ళలో కనపడునున్నారు. దీంతో అన్ని ఆలయ అధికారులు కూడా అన్ని రకాలుగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో కూడా బతుకమ్మ పండుగ ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.
Read also : OG కటౌట్ లో పవన్ కళ్యాణ్.. సినిమా సినిమానే.. రాజకీయం రాజకీయమే!
Read also : దసరా సెలవుల్లో ఊరెళ్తున్నారా… జరభద్రం : సీఐ చరమంద రాజు