సినిమా

దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే సినిమా హిట్టా?.. ఫ్లాపా?.. పబ్లిక్ రివ్యూ!

క్రైమ్ మిర్రర్,సినిమా న్యూస్ :- దుల్కర్ సల్మాన్ హీరోగా భాగ్యశ్రీ బోర్స్ హీరోయిన్ గా నటించినటువంటి సినిమా కాంత. ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ నిన్న ప్రీమియర్స్ షోలు పడ్డాయి. ఈరోజు అన్ని థియేటర్లలో కూడా విడుదలవుతున్న సందర్భంలో ప్రీమియర్ షోలు చూసిన అభిమానులు సినిమా ఎలా ఉందో సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. పబ్లిక్ ఆడియన్స్ ఈ సినిమా గురించి ఏమంటున్నారు అంటే.. ఈ కాంతా సినిమా చాలా థ్రిల్లింగ్ గా ఉంది అంటూ.. మూవీ చూస్తున్నంత సేపు కూడా చూస్తూనే ఉండాలనిపిస్తుంది అని అభిమానులు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతూ కామెంట్లు చేస్తున్నారు. ఈ సినిమాలో హీరోగా దుల్కర్ సల్మాన్, హీరోయిన్ గా భాగ్యశ్రీ బోర్సే యాక్టింగ్ అదిరిపోయాయి అని ప్రీమియర్స్ చూసిన అభిమానులు ఈ సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. మరోవైపు సీనియర్ నటులు రానా నటన కూడా చాలా అద్భుతంగా ఉంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. సినిమా విజువల్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి అని కూడా చెబుతున్నారు. ఇక సినిమా BGM మరియు సాంగ్స్ కూడా చాలా బాగున్నాయంటున్నారు. కానీ ఇంకో వైపు ఈ సినిమాలో మైనస్ పాయింట్ ఏదైనా ఉంది అంటే అది సెకండ్ హాఫ్ కాస్త స్లోగా అలాగే బోరింగ్ గా ఉండడమే అని మరి కొంతమంది మీడియాకు వివరిస్తున్నారు. మరికొద్ది సేపట్లో క్రైమ్ మిర్రర్ న్యూస్ వెబ్సైట్ నుంచి ఈ సినిమా రివ్యూ తెలుసుకుందాం. మరి ఈ సినిమా గురించి మీ అభిప్రాయం ఏంటో తెలియజేయండి.

Read also : పూణేలో ఘోర ప్రమాదం.. 6 వాహనాలు దగ్ధం.. 8 మంది మృతి!

Read also : గెలుపు ఎవరిదో కొన్ని గంటల్లోనే తేలనుంది.. వేగమైన ఫలితాల కోసం మీ క్రైమ్ మిర్రర్!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button