Thursday, March 19, 2026
Homeతెలంగాణకాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతో.. సీసీ రోడ్ పగుల్లు

కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతో.. సీసీ రోడ్ పగుల్లు

క్రైమ్ మిర్రర్, మహాదేవపూర్:- జయ శంకర్ జిల్లా, మహాదేవపూర్ మండలంలోని పలు గ్రామాల అభివృద్ధి కోసం ప్రభుత్వం రహదారి నిర్మాణానికి నిధులు కేటాయించిన కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది. స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో కాంట్రాక్టర్లు నాసిరకమైన రోడ్లు నిర్మిస్తూ ప్రభుత్వ నిధులను స్వాహా చేస్తున్నారనే ఆరోపణలు వెళ్ళుబడుతున్నాయి. మహాదేవ్ పూర్ మండలంలో మూడు సంవత్సరాల క్రితం వేసిన బెగులూరు సిసి రోడ్డు, సంవత్సర క్రితం వేసిన కృష్ణారావుపేట సిసి రోడ్డు పగుల్లు కాంట్రాక్టర్ల నిర్లక్ష్యానికి అద్దం పడుతుంది. లాభాపేక్షే ద్యేయంగా కాంట్రాక్టర్లు నాసిరకమైన సీసీ రోడ్లు నిర్మించి ప్రజాదానాన్ని స్వాహా చేస్తున్నారు. సంబంధిత అధికారులు మండలంలోని బెగులూరు సిసి రోడ్డు మరియు కృష్ణారావు పేట సిసి రోడ్డు నిర్మాణ నాణ్యతను పరిశీలించి నిర్లక్ష్యంగా సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టిన కాంట్రాక్టర్లపై తగు చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు.

Read also : ఆత్మకూరులో తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ కు నిరసన సెగ

Read also : ఒక వ్యక్తి నిద్రపోవడానికి ఎంత సమయం పడుతుంది?

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది.పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.
RELATED ARTICLES

Most Popular

Recent Comments