
క్రైమ్ మిర్రర్ తెలంగాణ బ్యూరో: హైదరాబాద్‌లోని ముషీరాబాద్ ప్రాంతంలో ఒక పీజీ డాక్టర్ (జాన్ పాల్) తన అద్దె ఇంటిని డ్రగ్స్ విక్రయ కేంద్రంగా మార్చాడు. ఎక్సైజ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ (STF) అధికారులు దాడి చేసి, అతనిని అరెస్టు చేశారు.
అతని నివాసం నుండి ఓజి కుష్, MDMA, LSD స్టిక్స్, కొకైన్, హాష్ ఆయిల్ వంటి ఆరు రకాల మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీ, బెంగళూరు వంటి నగరాల నుండి డ్రగ్స్ దిగుమతి చేసుకుని విక్రయిస్తున్నట్లు విచారణలో తేలింది. ఈ రాకెట్‌లో భాగమైన మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారు.
గచ్చిబౌలిలో డ్రగ్స్ పార్టీ భగ్నం: గచ్చిబౌలిలోని ఎస్ఎం లగ్జరీ గెస్ట్ రూమ్స్/కో-లివింగ్ హాస్టల్‌లో జరుగుతున్న డ్రగ్స్ పార్టీపై ఎస్ఓటీ పోలీసులు దాడులు నిర్వహించి 13 మందిని అరెస్టు చేశారు. వీరిలో ఐటీ నిపుణులు, విద్యార్థులు ఉన్నారు. ప్రధాన నిందితుడు తేజ కృష్ణ బెంగళూరుకు చెందిన నైజీరియన్ల నుండి డ్రగ్స్ కొనుగోలు చేసి స్థానికంగా విక్రయిస్తున్నాడు.





