అరాచక శక్తులను తరిమి కొట్టండి.. బీజేపీకి పట్టం కట్టండి : బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి

క్రైమ్ మిర్రర్, నిర్మల్ :- మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి నిర్మల్ మున్సిపాలిటీ లోని పలు వార్డుల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పట్టణంలోని బాలాజీవాడ, ధ్యాగవాడ, కొలిబండ, సోఫీనగర్, నటరాజ్ నగర్, కాలనీల్లో పర్యటించి బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా మహేశ్వర్ రెడ్డి గారు మాట్లాడుతూ నిర్మల్ మున్సిపాలిటీ కీ జరుగుతున్న ఎన్నికల్లో ప్రధానంగా పోటీ మజ్లిస్ కు,బిజెపికి మధ్యే ఉంది మజ్లస్ కు అండగా కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీలు పనిచేస్తున్నారు. ఈ మూడు పార్టీలు పరస్పరం సహకరించుకుంటూ నిర్మల్ మున్సిపాలిటీలో బిజెపిని ఓడించడానికి కుట్రలు పండుతున్నారు. ప్రజలు మజ్లిస్, కాంగ్రెస్, బిఆర్ఎస్ లు పన్నుతున్న కుట్రల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నిర్మల్ మున్సిపాలిటీ మజ్లిస్,కాంగ్రెస్, బీఆర్ఎస్ చేతుల్లోకి వెళితే, మజ్లిస్ అరాచక శక్తులు పేట్రేగిపోతాయి. గతంలో కాంగ్రెస్, టిఆర్ఎస్ పార్టీలు ఈ మున్సిపాలిటీని గెలుచుకొని ఎలాంటి అభివృద్ధి చేయలేకపోయాయి. ఇప్పుడు బిజెపికి అవకాశం ఇచ్చినట్టయితే మున్సిపల్ అభివృద్ధి జరగడానికి ఆస్కారం ఉంటుంది. ఈ మజ్లిస్ పార్టీకి కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీలు పూర్తిగా సహకరిస్తున్నాయి. హిందువులు ఐక్యంగా లేకపోతే మునిసిపాలిటీ మజ్లిస్ కైవసం అవుతుంది. “ఐక్యంగా ఉంటేనే బలపడతాం విడిపోతే పడిపోతాం” అనే వాస్తవాన్ని హిందూవులు గ్రహించాలి. కాంగ్రెస్ అంటే ముస్లింలు… ముస్లింలు అంటే కాంగ్రెస్” అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదే పనిగా మాట్లాడుతూ మజ్లిస్ కు సహకరిస్తున్నారు.మజ్లిస్ తో పాటు కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీలు కూడా హిందూ వ్యతిరేక పార్టీలే. ఈ వాస్తవాన్ని హిందూ బంధువులంతా గ్రహించాలి‌. మజ్లిస్ ఆగడాలకు అడ్డుకట్ట పడాలంటే మునిసిపల్ ఎన్నికల్లో నిర్మల్ పట్టణ ఓటర్లు బిజెపినే గెలిపించాలి. బాలాజీ వాడ అభ్యర్థి ఆకుల విజయ లక్ష్మీ గారిని, ద్యాగవాడ అభ్యర్థి గా ద్యాగ శివరామ కృష్ణ గారిని, కొలిబండ అభ్యర్థిగా సుంకరి సుజాత గారిని, సోఫీనగర్ అభ్యర్థి గా వోడ్నాల సుజాత రాజు గారిని, నటరాజ్ నగర్ అభ్యర్థిగా నవత్ స్వరూప రాజేందర్ గారిని కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నల్ల ఇంద్రకరణ్ రెడ్డి గారు,నాయకులు తక్కల రమణ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి కరిపే విలాస్, జిల్లా ఉపాధ్యక్షులు సత్యం చంద్రకాంత్, తో పాటు పట్టణ బీజేపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button