
క్రైమ్ మిర్రర్,ఆంధ్రప్రదేశ్:- ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో రాత్రికి రాత్రి ఎంతోమంది వైరల్ అయిపోతున్నారు. కొంతమంది తమ అందాలతో మరి కొంతమంది తమ టాలెంట్ తో ఒక్క రోజులోనే సోషల్ మీడియా వారిని వైరల్ చేసేస్తుంది. ఈ కోవలోనే తాజాగా కొంతమంది యూట్యూబర్స్ వారి ఛానల్ వ్యూస్ మరియు లైక్స్ కోసం కోవాబన్ వ్యాపారిని వీధిపాలు చేశారు. అతను కోవా బన్ అమ్ముతుండగా కొంతమంది యూట్యూబర్స్ అలాగే మీడియా వాళ్ళు అతని చుట్టూ చేరి డేట్ లేని కోవా బన్ అమ్ముతూ ఎంతమంది ప్రాణాలు తీస్తున్నారు.. అని నిలదీశారు. అతను నేను మంచివే అమ్ముతున్నాను.. కావాలంటే నేను కూడా తిని చూస్తాను అని చాలా అమాయకంగా చెప్తున్నటువంటి వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్అ వుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీ నేత పరిటాల శ్రీరామ్ కొంతమంది యూట్యూబ్లో వ్యూస్, లైక్స్ కోసం ఒక కోవాబన్ వ్యాపారిని రోడ్డుపైకి లాగడం దారుణమని కోవాబన్ వ్యాపారికి మద్దతుగా నిలిచారు. కష్టపడి కుటుంబాన్ని పోషించుకునే వారిని అందరూ కూడా గౌరవించాలి. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఆ వ్యాపారికి అందరి నుంచి మద్దతు లభిస్తుండగా ఇంకా మానవత్వం బ్రతికే ఉంది అని ఎక్స్ వేదికగా పరిటాల శ్రీరామ్ స్పందిస్తూ పోస్ట్ చేశారు.
శివరాత్రి రోజు మాంసం అమ్మకాలు నిషేధం : గ్రేటర్ బెంగళూరు అథారిటీ
రూ.300కి కొని, ఏకంగా రూ.634 కోట్లకు అమ్మేశాడు!









