
క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి యువతను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో పాలన ఎలా ఉందో ప్రతి ఒక్క యువత గమనించాలి అని.. మాజీ ముఖ్యమంత్రి జగన్ పిలుపునిచ్చారు. వ్యవస్థను మార్చాలి అంటే యువత ముందడుగు వేయాలి.. యువత తలుచుకుంటే ప్రభుత్వాలే మారిపోతాయంటూ జగన్ చెప్పుకొచ్చారు. వ్యవస్థను మార్చే విధంగా యువతలు ముందడుగు వేయాలని.. లేకుంటే ఇది ఇలానే కొనసాగుతుంది అని వివరణ ఇచ్చారు. ముఖ్యంగా యువత, విద్యార్థులు మనసులో తలుచుకుంటే ఎంతకైనా తెగించగలరు అని.. మీరు తలుచుకుంటే దేశ విదేశాల గవర్నమెంట్ లే మారిపోతాయి అని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక రాష్ట్ర ప్రభుత్వాలు మారిపోవడం అనేది ఒక పాత స్టోరీ అంటూ పేర్కొన్నారు. గత మా వైసీపీ ప్రభుత్వంలో విద్యకు ఎంత ప్రాధాన్యత ఇచ్చామో.. ప్రతి గ్రామంలోని మనుషులను అడిగిన ఈ విషయం చెబుతారు అని జగనన్నారు. మరి తెలుగుదేశం పార్టీ వచ్చాక విద్య వ్యవస్థ ఏ విధంగా బెడిసి కొట్టిందో అర్థమయింది కదా అని విమర్శించారు. చిన్నపిల్లలు చదువుకోవడం చంద్రబాబు నాయుడుకు అసలు ఇష్టం లేదు అని వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మరి ఈ విషయంపై కూడా ప్రభుత్వం అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఏ విధంగా స్పందిస్తారు అనేది వేచి చూడాల్సిందే.
Read also : కాంగ్రెస్ పార్టీ అంటేనే ముస్లిం పార్టీ అంట.. మరి హిందువులకు గౌరవం లేదా : కిషన్ రెడ్డి
Read also : ఫ్రెండ్ డబ్బుతో లాటరీ కొన్నాడు.. 11 కోట్ల గెలిచాడు.. చివరిలో ట్విస్ట్ సూపర్ భయ్యా?





