
క్రైమ్ మిర్ర్రర్, తెలంగాణ:- చలికాలమే కదా అని చాలామంది కూడా ప్రస్తుత రోజుల్లో కొన్ని పనులను మానేస్తూ ఉంటారు. ప్రతిరోజు ఏదో ఒక పని చేస్తూ చలికాలం రాగానే ఆ పనులన్నీ కూడా వాయిదా వేస్తూ కాలాన్ని గడుపుతూ ఉంటారు. ముఖ్యంగా ఈ చలికాలంలో చలి కారణంగా చాలామంది ఎక్కువగా నీరు త్రాగకుండా ఉంటారు. చలికాలం ఏ కదా అని.. శరీరానికి నీళ్లు అవసరం లేదు అని చాలామంది కూడా పొరపడుతూ ఉంటారు. కానీ ఇక్కడ శ్వాస మరియు యూరిన్ ద్వారా శరీరంలోని వాటర్ అంతా కూడా బయటికి పోతుంది. దీని ద్వారా రక్తం చక్కగా మారి గుండెమీద ఎక్కువ ఒత్తిడి పడుతుంది అని వైద్య నిపుణులు చెబుతున్నారు. కేవలం గుండె మీద ప్రెషర్ మాత్రమే కాకుండా BP కూడా విపరీతంగా పెరుగుతుంది. కిడ్నీలు మలినాలను క్లీన్ చేయలేవు, స్టోన్స్ రిస్క్ కూడా పెరుగుతుంది.
Read also : తెలంగాణలో చైల్డ్ ట్రాఫికింగ్ కలకలం.. 12 మందిని అరెస్టు చేసిన పోలీసులు?
అంతేకాకుండా చర్మం డ్రై అవ్వడం, పెదవులు పగిలిపోవడం మరియు మలబద్ధకం వంటి డిహైడ్రేషన్ లక్షణాలు కూడా కనిపిస్తాయి అని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి ప్రతి కాలంలోనూ ఖచ్చితంగా నీళ్లు శరీరానికి తగిన మోతాదులో తీసుకోవాలని చెప్తున్నారు. మరి ఎక్కువ కాకపోయినా ఈ చలికాలంలో ప్రతిరోజు రెండు నుంచి మూడు లీటర్ల వరకు నీళ్లు తాగాలి అని డాక్టర్లు సూచిస్తున్నారు. మరోవైపు చలికాలం వచ్చింది కదా అని చాలామంది కూడా వ్యాయామం చేయడం మానుకుంటారు. కానీ అలా చేయడం వల్ల శరీరంలో అనేక మార్పులు వస్తాయి అని వైద్యులు సూచిస్తున్నారు. ప్రతి కాలంలో ప్రతిరోజు చేసే పనిని నిత్యం చేస్తూనే ఉండాలి అని.. అనుకోకుండా ఒక్కసారిగా ఆపివేస్తే శరీర మార్పులు చోటుచేసుకుంటాయి అని అంటున్నారు.
Read also : తొలిరోజే బీహార్ సంచలనం.. వీళ్లు ప్లేయర్ల, రస్సెల్ కొడుకులా?





