
క్రైమ్ మిర్రర్, అంతర్జాతీయ న్యూస్:- ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఏ వాహనానికైనా టైర్లు నలుపు రంగులోనే ఉంటాయి. అలా ఎందుకు ఉంటాయి అనేది ప్రతి ఒక్కరికి ఏదో ఒక సందర్భంలో డౌట్ వచ్చే ఉంటుంది. కేవలం నలుపు రంగులోనే ఎందుకు ఉన్నాయి.. తెలుపు, ఎరుపు, పసుపు లేదా బ్లూ కలర్ లో ఉండొచ్చు కదా?.. అనే ప్రశ్నలు చాలా మందిలో మెదిలే ఉంటాయి. అయితే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఏ వాహనానికైనా టైర్లు నలుపు రంగులోనే ఉండడానికి గల కారణాలు కొన్ని ఉన్నాయి. వాస్తవానికి ఒక నేచురల్ రబ్బర్ నిజానికి తెల్లగానే ఉంటుంది. కానీ వాహనాలు టైర్లు మాత్రం నలుపు రంగు తప్ప మరే రంగులో కూడా కనిపించవు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే కార్బన్ బ్లాక్.
Read also : పవన్ వ్యాఖ్యలకు భయపడేవారు ఎవరూ లేరు ఇక్కడ : పేర్ని నాని
ఈ కార్బన్ బ్లాక్ అనేది రబ్బర్ కు కలపడం వల్ల అది నల్లగా మారుతుంది. దీనివల్ల టైర్ కు మంచి గ్రిప్ అనేది అందుతుంది. అలాగే టైర్లు నలుపు రంగులో ఉండడం వల్ల ఎన్నో రకాలుగా ఉపయోగాలు కూడా ఉన్నాయి. సూర్యుడి నుంచి వచ్చేటువంటి యూవీ రేస్ అనేవి కూడా ఈ టైర్లకు తగలకుండా కాపాడుతుంది. దీనివల్ల టైర్లు అనేవి త్వరగా అరిగిపోకుండా ఎక్కువ కాలం పాటు వస్తుంటాయి. కాబట్టే టైర్లలో వాడే ఈ కార్బన్ బ్లాక్ వల్లనే ఈరోజు టైర్లు నలుపు రంగులో ఉండడం అలాగే వెంటనే అరిగిపోకుండా ఎక్కువ రోజులు పాటు వస్తున్నాయి.
Read also : 2023 వరల్డ్ కప్ ఓటమి తర్వాత క్రికెట్ మానేద్దామనుకున్నా.. కానీ : రోహిత్ శర్మ





