Monday, February 16, 2026
Homeసినిమాజూనియర్ ఎన్టీఆర్ ఫేవరెట్ స్నాక్స్ ఇవే..?

జూనియర్ ఎన్టీఆర్ ఫేవరెట్ స్నాక్స్ ఇవే..?

క్రైమ్ మిర్రర్,సినిమా న్యూస్:- తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రతి ఒక్క హీరోకి ఫేవరెట్ ఫుడ్ అలాగే ఫేవరెట్ స్నాక్స్ ఉంటాయి. ఏ సిట్యువేషన్ లో ఉన్న ఆ ఫేవరెట్ ఫుడ్ ను ఆహారంగా తీసుకుంటూ ఉంటారు. ఈ నేపథ్యంలో నే తాజాగా జూనియర్ ఎన్టీఆర్ సైతం తన ఫేవరెట్ స్నాక్స్ ఏంటో స్పష్టంగా తెలియజేశారు. అమెరికన్ టీవీ ఛానల్ “ఎస్క్వైర్ నెట్వర్క్” కు ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా జూనియర్ ఎన్టీఆర్ తన ఫేవరెట్ స్నాక్స్ ను తెలియజేశారు. “నాకు పునుగులు అంటే చాలా ఇష్టం.. అల్లం మరియు పల్లి చట్నీతో ఆ పునుగులు తింటుంటే ఎంతో బాగుంటుంది” అని జూనియర్ ఎన్టీఆర్ చాలా ఆనందంతో తన వ్యక్తిగత ఇష్టమైన ఆహారం గురించి ప్రస్తావించారు.

బిల్ గేట్స్‌కు సీఎం చంద్రబాబు ఆత్మీయ స్వాగతం

సహజంగానే జూనియర్ ఎన్టీఆర్ను ఆహార ప్రియుడు అంటూ ఎన్నో సందర్భాల్లో తమ అభిమానులు అలాగే ప్రేక్షకులు అంటుంటారు. ఒకప్పుడు బిర్యానీ అంటే చాలా ఇష్టం అని చెప్పిన జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు ఫేవరెట్ స్నాక్స్ గురించి తెలియజేశారు. దీంతో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ సైతం తమ ఇష్టమైన స్నాక్స్ ను మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్.. ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో డ్రాగన్ సినిమా షూటింగ్ లో బిజీ బిజీగా గడుపుతున్నారు. ఈ సినిమా కోసం ఫాన్స సైతం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకులు అలాగే టాలీవుడ్ ఇండస్ట్రీ పెద్దలు మొత్తం భారీగానే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయం ఏంటో తెలియజేయండి

Renuka Chowdhury: కారులో కుక్కతో పార్లమెంట్ కు.. ఎంపీ రేణుకా చౌదరికి ప్రివిలేజ్‌ నోటీసు!

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments