
క్రైమ్ మిర్రర్, జాతీయ న్యూస్:- మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల జీతం తెలిస్తే ప్రతి ఒక్కరు కూడా షాక్ అవుతారు. ప్రస్తుతం 2025వ ఆర్థిక సంవత్సరానికి గాను అతనికి ప్రతి ఏడాది కి 96.5 మిలియన్ల డాలర్ల జీతం అందుకుంటున్నారు. అంటే మన ఇండియన్ కరెన్సీలో దాదాపు 846 కోట్ల జీతం ఆయన ప్రతి ఏడాది కూడా తీసుకుంటున్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 22 శాతం ఎక్కువ జీతం అతను తీసుకుంటున్నారు. సత్య నాదెళ్ల వల్ల ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ లో మైక్రోసాఫ్ట్ చాలా పురోగతి సాధించిడంతో… ఆ కంపెనీ షేర్లు ధరలు కూడా భారీగా పెరిగాయని మైక్రోసాఫ్ట్ కంపెనీ బోర్డ్ పేర్కొంది. దీంతో సత్య నాదెళ్లకు అలాగే తన లీడర్ షిప్ టీం వల్లనే కంపెనీ అభివృద్ధి చెందుతుంది అని ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రస్తుతం సీఈఓ గా చాలామంది కొన్ని కోట్ల రూపాయలను జీతం గా తీసుకుంటున్నారు. అందులో భాగంగానే మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్లకు జీతంగా సంవత్సరానికి 846 కోట్ల రూపాయలు మైక్రోసాఫ్ట్ కంపెనీ ఇస్తుంది. దీంతో అతని వెనుక దాగి ఉన్న కష్టం, పట్టుదల వాళ్ళనే నేడు సీఈఓ గా మైక్రోసాఫ్ట్ కంపెనీని ముందుకు నడిపిస్తున్నారని చాలామంది సత్య నాదెళ్లపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ సత్యనాదెళ్ల లా అవ్వాలని ఎంతోమంది మన దేశం లో యువకులు పోరాటాలు చేస్తున్నారు. ఎంతోమంది యువకులకు కూడా ఈ మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య ఆదర్శంగా నిలిచారు.
Read also : ఏపీలో ఆకస్మిక వరదలకు అవకాశం.. రెడ్ అలర్ట్!
Read also : ఈశ్వర్ – బాహుబలి.. ప్రభాస్ బర్త్డే స్పెషల్!