జాతీయంవైరల్

కిడ్నీలు బాగుండాలి అంటే ఎన్ని లీటర్ల నీళ్లు త్రాగాలో తెలుసా?

క్రైమ్ మిర్రర్, జాతీయ న్యూస్:- ప్రస్తుత రోజుల్లో చాలామంది కిడ్నీ సంబంధిత వ్యాధులతో పోరాడుతూ ఉన్నారు. కిడ్నీలు ఆరోగ్యంగా ఉండడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇప్పటికీ ఎంతోమంది ఆసుపత్రిలలో కిడ్నీల బాగుకోసం లక్షల్లో ఖర్చులు పెడుతున్నారు. కానీ సాధారణంగా కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలి అంటే ప్రతిరోజు కూడా సరిపడా నీరు త్రాగాలి అని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ప్రతిరోజు కూడా పురుషులు అలాగే స్త్రీలు ఎన్ని లీటర్ల నీళ్లు తాగాలో తాజాగా యూఎస్ అకాడమీస్ ఆఫ్ సైన్సెస్ తెలిపింది. దీని ప్రకారం పురుషులందరూ కూడా ప్రతిరోజు 3.7 లీటర్లు నీరు త్రాగాలి. అలాగే మరోవైపు స్త్రీలు ప్రతిరోజు కూడా 2.7 లీటర్ల నీరు సేవించాలి అని ఈ నివేదిక తెలిపింది. అయితే చాలామంది ప్రతిరోజు కూడా అధిక మొత్తంలోనూ లేదా అత్యల్పంగాను నీరు తీసుకుంటూ ఉంటారు. కానీ ప్రతి ఒక్కరు కూడా వారి వయసు, బరువు అలాగే వాతావరణ పరిస్థితులను బట్టి మీరు తీసుకునే విధానంలో మార్పులు ఉండాలి అని సూచించారు. ఇక ముఖ్యంగా గర్భిణీలు అలాగే పాలిచ్చే తల్లులు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా సాధారణంగా కన్నా ఎక్కువగా నీరు తాగాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. తక్కువ నీరు తాగితే హైడ్రేషన్ కు గురయ్యే అవకాశం ఉంది అని తెలిపారు. అదే ఎక్కువ నీరు సేవిస్తే హైపో నాట్రేమియా సమస్యలు వస్తాయి అని చెబుతున్నారు. కాబట్టి కిడ్నీలు బాగుండాలి అంటే కచ్చితంగా డాక్టర్లు తెలిపిన మోతాదులోని తాగాలి.

Read also : సర్పంచ్ పదవి వేలం.. 73 లక్షలకు దక్కించుకున్న ముస్లిం మహిళ

Read also : రోహిత్ సిక్సర్ల రికార్డు ను బ్రేక్ చేసే దమ్ము ఎవరికి ఉంది?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button