అంతర్జాతీయంలైఫ్ స్టైల్

పురుషుల కంటే స్త్రీలకే ఆ కోరికలు ఎక్కువ?

పురుషుల శృంగార కోరికలు 20 ఏళ్ల వయసులోనే అత్యధికంగా ఉంటాయనే సాధారణ అభిప్రాయానికి తాజా అంతర్జాతీయ అధ్యయనం గట్టి షాక్ ఇచ్చింది.

పురుషుల శృంగార కోరికలు 20 ఏళ్ల వయసులోనే అత్యధికంగా ఉంటాయనే సాధారణ అభిప్రాయానికి తాజా అంతర్జాతీయ అధ్యయనం గట్టి షాక్ ఇచ్చింది. వయసు పెరిగేకొద్దీ శృంగార ఆసక్తి తగ్గిపోతుందనే భావన పూర్తిగా సరైంది కాదని ఈ పరిశోధన స్పష్టం చేస్తోంది. పురుషుల్లో శృంగార కోరికలు వయసుతో కాకుండా శారీరక మరియు మానసిక పరిపక్వతతో బలంగా అనుసంధానమై ఉంటాయని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఆశ్చర్యకరంగా, నలభయ్యేళ్ల వయసులో పురుషుల సెక్స్ డ్రైవ్ అత్యున్నత స్థాయికి చేరుతుందని ఈ అధ్యయనం తేల్చి చెప్పింది.

ఎస్టోనియాలోని టార్టూ యూనివర్సిటీకి చెందిన పరిశోధక బృందం ఈ అధ్యయనాన్ని నిర్వహించింది. 20 నుంచి 84 ఏళ్ల మధ్య వయసున్న 67 వేల మందికిపైగా వ్యక్తుల డేటాను విశ్లేషించి ఈ నివేదికను సిద్ధం చేశారు. పురుషుల్లో శృంగార కోరికలు 20 ఏళ్ల ప్రారంభంలో క్రమంగా పెరుగుతాయని, 40 ఏళ్ల ప్రారంభ దశలో గరిష్ట స్థాయికి చేరుకుంటాయని ఈ అధ్యయనం వెల్లడించింది. ఆ తర్వాత వయసు పెరిగేకొద్దీ మెల్లగా తగ్గుదల కనిపిస్తుందని పేర్కొన్నారు.

ఈ పరిశోధనలో మరో ఆసక్తికర అంశం వెలుగులోకి వచ్చింది. సాధారణంగా అరవయ్యేళ్లు దాటితే శృంగార ఆసక్తి చాలా తక్కువగా ఉంటుందని భావిస్తారు. కానీ ఈ అధ్యయనం ప్రకారం 60 ఏళ్ల వయసున్న పురుషుల్లో కూడా శృంగార కోరికలు 20 ఏళ్ల యువకుల స్థాయిలోనే కొనసాగుతున్న సందర్భాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇది ఇప్పటివరకు ఉన్న అభిప్రాయాలకు పూర్తిగా భిన్నంగా ఉండటం విశేషంగా మారింది.

మహిళల విషయంలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉందని పరిశోధకులు తెలిపారు. మహిళల్లో శృంగార కోరికలు 20 ఏళ్ల చివరి నుంచి 30 ఏళ్ల మధ్యకాలంలో అత్యధికంగా ఉంటాయని ఈ అధ్యయనం వెల్లడించింది. ఆ తర్వాత వయసు పెరిగేకొద్దీ క్రమంగా తగ్గుదల కనిపిస్తుందని పేర్కొన్నారు. ముఖ్యంగా 50 ఏళ్ల తర్వాత మహిళల్లో ఈ తగ్గుదల వేగంగా జరుగుతుందని అధ్యయనం స్పష్టం చేసింది.

వృద్ధుల జీవితకాలాన్ని మొత్తం పరిశీలించినప్పుడు, చాలా సందర్భాల్లో వృద్ధ పురుషుల్లో శృంగార కోరికలు మహిళల కంటే ఎక్కువగా కొనసాగుతున్నాయని పరిశోధకులు వెల్లడించారు. ఈ ఫలితాలు తమకూ ఆశ్చర్యం కలిగించాయని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఇప్పటివరకు శృంగార కోరికలకు ప్రధాన కారణాలుగా శారీరక ఆరోగ్యం, హార్మోన్ల స్థాయి, సంతానోత్పత్తి సామర్థ్యాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకున్నారని చెప్పారు.

వాస్తవానికి పురుషుల్లో టెస్టోస్టెరాన్ హార్మోన్ స్థాయి 30 ఏళ్ల ప్రారంభం నుంచే తగ్గడం మొదలవుతుంది. అయినప్పటికీ శృంగార కోరికలు 40 ఏళ్ల వరకు పెరుగుతూనే ఉండటం ఈ అధ్యయనంలో బయటపడింది. దీని ఆధారంగా శృంగార ఆసక్తికి కేవలం హార్మోన్లే కాదు.. మానసిక స్థిరత్వం, జీవిత అనుభవం, భావోద్వేగ పరిపక్వత కూడా కీలక పాత్ర పోషిస్తున్నాయని పరిశోధకులు అభిప్రాయపడ్డారు.

ఈ అధ్యయనం ద్వారా శృంగార కోరికలపై ఇప్పటివరకు ఉన్న అనేక అపోహలు తొలగిపోతాయని నిపుణులు భావిస్తున్నారు. వయసు పెరిగిందని మాత్రమే శృంగార ఆసక్తి తగ్గిపోతుందని అనుకోవడం సరికాదని.. వ్యక్తిగత జీవనశైలి, మానసిక ఆరోగ్యం, సంబంధాల నాణ్యత కూడా ఇందులో కీలకమని ఈ పరిశోధన స్పష్టం చేస్తోంది.

ALSO READ: SHOCKING: కిడ్నీలో 500 గ్రాముల రాయి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button