Monday, March 2, 2026
Homeఆంధ్ర ప్రదేశ్దిత్వా తుఫాన్ ఎఫెక్ట్.. ఏపీలో మూడు జిల్లాల స్కూళ్లకు సెలవులు!

దిత్వా తుఫాన్ ఎఫెక్ట్.. ఏపీలో మూడు జిల్లాల స్కూళ్లకు సెలవులు!

క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్:- దిత్వా తుఫాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై ప్రభావం చూపుతున్న నేపథ్యంలో విద్యాశాఖ అధికారులు మూడు జిల్లాలలో సెలవు ప్రకటించారు. ఇప్పటికే దిత్వా తుఫాన్ ప్రభావం కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇకపోతే ఈ దిత్వ తుఫాను నేపథ్యంలో తిరుపతి, నెల్లూరు మరియు అన్నమయ్య జిల్లాలలో విద్యాశాఖ అధికారులు రేపు సెలవు ప్రకటించారు. దిత్వా తుఫాను ప్రభావం కారణంగా రేపు తిరుపతి, నెల్లూరు మరియు అన్నమయ్య జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు కీలక హెచ్చరికలు జారీ చేశారు. దీంతో తల్లిదండ్రులు మరియు పిల్లలు ఎక్కడా కూడా ఈ వర్షాల కారణంగా ఇబ్బందులు పడకుండా ఉండేలా ముందస్తు జాగ్రత్తతో రేపు ఆ 3 జిల్లాల్లోని స్కూలు, కాలేజీలు మరియు అంగన్వాడీలకు సెలవు ప్రకటించారు. ఇక మరోవైపు చిత్తూరు, ప్రకాశం జిల్లాలకు కూడా ఈ దిత్వ తుఫాన్ నుంచి ఉన్న నేపథ్యంలో తమ పిల్లలకు కూడా సెలవు ఇవ్వాలి అని పేరెంట్స్ కోరారు. ఇప్పటికే ఈ తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉన్న జిల్లాలకు NDRF మరియు SDRF బృందాలను పంపించారు. ఈ తుఫాన్ దాటికి పడేటువంటి వర్షాలకు ప్రజలు ఎక్కడ కూడా ఇబ్బందులు పడకుండా ఉండేలా ప్రభుత్వము అన్ని రకాలుగా ఏర్పాట్లను చేసింది. కాబట్టి ఈ రెండు రోజులపాటు అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్ళవద్దు అని సూచించారు. ద్విత్వ తుఫాన్ ప్రభావం కారణంగా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. పలువురు అధికారులతో హోం మంత్రి అనిత సమావేశం నిర్వహించి కీలక ఆదేశాలను జారీ చేసింది.

Read also : భారత జట్టు టెస్ట్ ప్రదర్శన పై సుప్రీంకోర్టులో చర్చ!.. నవ్విన న్యాయవాదులు?

Read also : Foot Reading: అరికాలిపై ఈ రెండు అదృష్ట గుర్తులు ఉంటే చాలట!.. సంపద, కీర్తి..

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది.పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.
RELATED ARTICLES

Most Popular

Recent Comments