Monday, March 2, 2026
Homeక్రీడలుభారత జట్టు టెస్ట్ ప్రదర్శన పై సుప్రీంకోర్టులో చర్చ!.. నవ్విన న్యాయవాదులు?

భారత జట్టు టెస్ట్ ప్రదర్శన పై సుప్రీంకోర్టులో చర్చ!.. నవ్విన న్యాయవాదులు?

క్రైమ్ మిర్రర్, స్పోర్ట న్యూస్ :- టీం ఇండియా మరియు సౌత్ ఆఫ్రికా మధ్య జరిగిన రెండు టెస్టు మ్యాచ్లలో భారత్ ఘోరంగా పరాజయం పొందిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే తాజాగా భారత జట్టు మరియు సౌత్ ఆఫ్రికా మధ్య జరిగిన టెస్ట్ ప్రదర్శన పై సుప్రీంకోర్టులో చర్చ జరిగింది. ఇవాళ సుప్రీంకోర్టులో ఓ కేసు విచారణ సందర్భంగా జస్టిస్ మరియు న్యాయవాదుల మధ్య సరదా సంభాషణ ప్రతి ఒక్కరిని కూడా నవ్వులు పూయించింది. భారత జట్టు ప్రదర్శన ప్రతి ఒక్కరు కూడా చూడాలి అని.. టీ20 లపై భారత జట్టు ఆటగాళ్లు ఎక్కువగా దృష్టి పెడితే ఏదో ఒక రోజు టెస్ట్ మ్యాచ్ లో ఓడిపోతారు… అని జస్టిస్ సుందరేష్ అనగా… దీనికి బదులుగా అక్కడే ఉన్నటువంటి న్యాయవాది ముకుల్ వ్యాఖ్యానిస్తూ… టీమిండియా హెడ్ కోచ్ గంభీర్ నా స్నేహితుడే అని అన్నారు. అంతేకాకుండా అతనితో ఈరోజు ఉదయం మాట్లాడాను అని.. సొంత పిచ్ లపై భారత్ ఇలా ఓడిపోవడం పై మీరు ఇక కోచ్గా మానేయడం మంచిదని దేశం మొత్తం కూడా చెబుతుంది అని చెప్పాను.. అని అనడంతో అక్కడున్నటువంటి న్యాయవాదులు అందరూ కూడా ఒక్కసారిగా నవ్వారు. ఇకపోతే భారత్ మరియు సౌతాఫ్రికా మధ్య జరిగిన టెస్ట్ మ్యాచ్ లలో భారత్ ఓడిపోవడం పట్ల ఫ్యాన్స్ తీవ్ర నిరాశ చెందిన విషయం తెలిసిందే. ఇదే చర్చ తాజాగా సుప్రీంకోర్టులో జరగడంతో ప్రతి ఒక్కరు కూడా తమ అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా తెలుపుతున్నారు.

Read also : Foot Reading: అరికాలిపై ఈ రెండు అదృష్ట గుర్తులు ఉంటే చాలట!.. సంపద, కీర్తి..

Read also : 30 రోజులు టీవీ ఆపలేదు.. ఆ తరువాత ఏం జరిగిందంటే?

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది.పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.
RELATED ARTICLES

Most Popular

Recent Comments