
క్రైమ్ మిర్రర్,తెలంగాణ:- కాలేశ్వరంలో అవినీతికి పాల్పడినందుకు కేసీఆర్ ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎప్పుడు అరెస్ట్ చేస్తారో చెప్పాలంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు తాజాగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కౌంటర్ వేశారు. అసలు జైలులో వేయడానికి మేము ఎవరయ్యా అంటూ.. అవి కోర్టుల బాధ్యత అని రేవంత్ రెడ్డి కి కౌంటర్ వేశారు. అలాగే కేసీఆర్ ను జైల్లో వేస్తామని మేము ఎక్కడా కూడా చెప్పలేదే.. కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం NDSA నివేదికపై మాత్రమే సిబిఐ విచారణ కోరింది అని తెలిపారు. ఇకపోతే గవర్నర్ తన అధికారులను స్వేచ్ఛగా వినియోగించుకుంటూ ముందుకు సాగుతున్నారు అని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. మీకు మీరే ఏది పడితే అది ఊహించుకుంటే దానికి మేమేం చేయలేం అంటూ సమాధానం ఇచ్చారు.
Read also : జూబ్లీహిల్స్ లో ఓడిపోతామన్న భయం లో రేవంత్ ఉన్నాడు : కేటీఆర్
కాగా నిన్న జూబ్లీహిల్స్ లోని రహమత్ నగర్ రోడ్ షో లో పాల్గొన్న రేవంత్ రెడ్డి బీజేపీ పార్టీలో బీఆర్ఎస్ ప్రభుత్వం విలీనం అవుతుందని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక కాలేశ్వరం ప్రాజెక్టులో కేసీఆర్ కొన్ని లక్షల రూపాయలను కొల్లగొట్టారు అని మోదీ, అమిత్ షా తెలిపారని చెప్పారు. మరి కేంద్రమే ఎందుకు కెసిఆర్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేయడం లేదు.. కెసిఆర్, హరీష్ ను ఎప్పుడు అరెస్ట్ చేస్తారో చెప్పాలి అని రేవంత్ రెడ్డి ప్రశ్నించిన సందర్భంలో నేడు కిషన్ రెడ్డి స్పందిస్తూ రేవంత్ రెడ్డి పై కౌంటర్లు వేశారు.
Read also : హైదరాబాద్-విజయవాడ హైవే విస్తరణకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్





