
క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్ న్యూస్ :- భారత క్రికెట్ చరిత్రలో మొహమ్మద్ షమీ ది మలుపులు తిరిగిన చరిత్ర. క్రికెట్ చరిత్రలోనే కాకుండా తన జీవిత చరిత్రలో కూడా ఎన్నో మలుపులు తిరిగాయి. ఎన్నో ప్రశంసలు.. అంతకుమించి విమర్శలు కూడా వచ్చాయి. కానీ వాటన్నిటిని దాటుకుంటూ నేడు భారత స్టార్ బౌలర్ గా మహమ్మద్ షమీ ఎదిగిపోయారు. వరల్డ్ కప్ లో నెంబర్ వన్ గా రాణించి తన సత్తా ఏంటో మరోసారి నిరూపించారు. ఇండియా తరపునే కాకుండా.. ఐపీఎల్ లీగ్ లోను మరికొన్ని ఇతర లీగ్స్ లో కూడా చాలా అద్భుతంగా రాణిస్తూ ఉంటారు. అయితే తాజాగా ఈ స్టార్ బౌలర్ మహమ్మద్ షమీపై రిటైర్మెంట్ గురించి చాలానే సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. అయితే వీటిపై విమర్శలకు షమీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
Read also : భారీ వర్షాలకు కోతకు గురైన నేషనల్ హైవే?
భారత బౌలర్ అయినటువంటి నేను.. అసలు ఎందుకు రిటైర్ అవ్వాలి?.. అని విమర్శకులను ప్రశ్నించారు. మీకేమైనా సమస్య ఉంటే నాతో చెప్పండి. నా రిటైర్మెంట్ తో ఎవరికీ ఎటువంటి మేలు కలుగుతుందో నాకు తెలియాలి అని అన్నారు. అంతేకాదు.. నాకు బోర్ కొడితేనే రిటైర్మెంట్ ప్రకటిస్తాను అని మహమ్మద్ షమీ సంచలన ప్రకటన చేశారు. నాకు రిటైర్మెంట్ ఇవ్వాలనిపిస్తేనే ఇస్తాను.. మీరు చెప్తే ఇవ్వను అని అన్నారు. జాతీయ జట్టులో నన్ను సెలెక్ట్ చేయకపోతే డొమెస్టిక్ క్రికెట్ లో ఆడడానికి ప్రయత్నం చేస్తా. ఏదో ఒక లీగ్.. ఏదో ఒక టీం తరఫున ఎప్పుడూ కూడా ఆడుతూనే ఉంటా. నన్ను సెలెక్ట్ చేయలేదని… నన్ను ఎందుకు తీసుకోలేదని నేను ఎవరిని నిందించను. అవకాశం వచ్చిన ప్రతిసారి కూడా ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ నా సత్తా చాటుతానని అన్నారు. అందుకోసమే ఎప్పుడూ కూడా కష్టపడుతూనే ఉంటాను అని.. వెనక్కి తగ్గేదే లేదు అని మహమ్మద్ షమీ స్పష్టంగా తెలియజేశారు. దీంతో షమి ఇప్పట్లో రిటైర్మెంట్ ప్రకటించారు అని అర్థమవుతుంది.
Read also : భారీ వర్షాలపై స్పందించిన కేసీఆర్.. బీఆర్ఎస్ నాయకులకు కీలక సూచనలు!