తెలంగాణ

చండీయాగం చేసిన కేసీఆర్‌.. కష్టాల నుంచి గట్టెక్కినట్టేనా..?

క్రైమ్ మిర్రర్, తెలంగాణ:- రాయకీయ నాయకుల్లో చాలా మందికి సెంటిమెంట్స్‌ ఉంటాయి. వారిలో ప్రధానంగా చెప్పుకునే నాయకుడు కేసీఆర్‌. ఆయనకు దైవభక్తి, సెంటిమెంట్స్‌ చాలా ఎక్కువని చెప్పాలి. అధికారంలో ఉన్నన్నాళ్లు పాత సెక్రటేరియట్‌లో ఆయన అడుగుపెట్టకపోవడానికి.. వాస్తు సమస్యలే కారణమన్న ప్రచారం కూడా ఉంది. వాస్తు పరమైన నమ్మకాలే కాదు… యాగాలు, యజ్ఞాలు చేసే అలవాటు కూడా ఉంది కేసీఆర్‌కు. అశాంతిగా ఉన్నా… ప్రతికూల సంకేతాలు కనిపిస్తున్నా… ఆయన యాగాలు చేస్తారు. ఇప్పుడు కూడా చండీయాగం నిర్వహించారు. ఈ యాగం వల్ల … అనుకున్న ఫలితాలు వస్తాయని కేసీఆర్‌ నమ్మకం.

Read also : అట్టహాసంగా మొదలైన బిగ్ బాస్ 9, ఆరుగురు సామాన్యులకు చోటు!

కేసీఆర్‌కు ప్రస్తుతం కష్టకాలం నడుస్తోందనే చెప్పాలి. 2023 ఎన్నికల్లో ఓడిపోయినప్పుటి నుంచి ఆయనపై అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో కవిత జైలు వెళ్లడం దగ్గర నుంచి.. వరుసగా ప్రతికూల పరిస్థితులే ఎదురవుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన రెండో రోజో.. ఆయన కాలు జారి పడిపోవడం. ఫామ్‌హౌస్‌కే పరిమితం కావాల్సి రావడం.. రేవంత్‌రెడ్డి సర్కార్‌.. బీఆర్‌ఎస్‌ హయాంలో అవినీతి జరిగిందంటూ విచారణ కమిషన్లు వేయడం.. ఇలా అన్నీ ప్రతికూల పరిస్థితే. ఫోన్‌ ట్యాపింగ్‌, కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై ఎంక్వైరీలు… కేటీఆర్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫార్ములా ఈ-రేసు కేసు.. లాంటివి కేసీఆర్‌ను ఇబ్బంది పెడుతూ ఉన్నాయి. ఇటీవల.. కూతురు కవిత తీరు… మరీ చికాకు పెట్టినట్టుంది కేసీఆర్‌ను. దీంతో… బాగా అంశాంతిలో ఉన్న కేసీఆర్‌.. చండీయాగం చేయించినట్టు సమాచారం.

Read also : జీఎస్టీ సవరణలతో జీడీపీకి జోష్.. ఆదాయం లోటు రాదన్న నిర్మలా

ఎప్పుడు ప్రతికూల పరిస్థితి ఎదురైనా.. కేసీఆర్‌ చండీయాగం చేస్తారు. ఆ యాగం తర్వాత పరిస్థితి చక్కబడుతుందని ఆయన నమ్మకం. ఆ విశ్వాసంతో 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాజ్యశ్యామల యాగం చేశారు. గతంలోనూ చండీయాగం చేశారు కేసీఆర్‌. ఇప్పుడు కూడా చండీయాగం చేశారు. ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కేసీఆర్‌ దంపతులు ఈ యాగాన్ని జరిపించారు. ఈ పూజలలో కొందరు బీఆర్‌ఎస్‌ నేతలు పాల్గొన్నట్టు తెలుస్తోంది. బీఆర్‌ఎస్‌ పార్టీ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది.. అటు కుటుంబం కూడా ముక్కతైంది. కూతురు కవిత.. తండ్రికి, అన్నకు దూరం జరిగారు. పరిస్థితి ఇలా ఉంటే.. త్వరలో జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికల, స్థానిక సంస్థల ఎలక్షన్స్‌ జరగబోతున్నాయి. ఆ ఎన్నికల్లో సత్తా నిరూపించుకోవాలని కేసీఆర్‌ భావిస్తున్నారు. అందుకే చండీయాగం చేశారని కూడా కొందరు చెప్తున్నారు.

Read also : జీఎస్టీ సవరణలతో జీడీపీకి జోష్.. ఆదాయం లోటు రాదన్న నిర్మలా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button