తెలంగాణ

అడవి పందిని వేటాడిన మంచు విష్ణు!.. వీడియో బయటపెట్టిన మంచు మనోజ్!!

క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : మంచు కుటుంబంలో విభేదాలు కొనసాగుతున్నాయి. అన్నదమ్ములు మంచు మనోజ్, విష్ణు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. కొన్ని రోజులుగా సైలెంటుగానే ఉన్న సమయం కూడా ఇద్దరు ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది. ఆదిపత్యం కోసం ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటున్నారని చెబుతున్నారు. తాజాగా మంచు విష్ణుకు సంబంధించిన సంచలన వీడియో బయటికి వచ్చింది. అడవి పందిని వేటాడరనే ఆరోపణలు వస్తున్నాయి. మంచు విష్ణు సిబ్బంది అడవి పందిని వేటాడి.. కర్రలపై తీసుకున్న వీడియో బయటికి వచ్చింది. జల్ పల్లి లోని అడవిలో మంచు విష్ణి సిబ్బంది వేట కొనసాగించారని తెలుస్తోంది. అడవి పందులను వేటాడారు విష్ణు సిబ్బంది.

Also Read : పవిత్రమైన అయ్యప్ప మాలలో ఉండి.. ఇంత ఘోరమేంటి స్వామి..!!!

చిట్ట అడవిలోకి వెళ్లి అడవి పందులను వేటాడి తీసుకువెళ్లారు విష్ణు మేనేజర్ కిరణ్. వేటాడిన అడవి పందిని బంధించి తీసుకువెళ్లాడుఎలక్ట్రిషన్ దేవేంద్ర ప్రసాద్. ఇద్దరి చర్యలను తప్పుపడుతూ పలుమార్లు మంచు మనోజ్ అభ్యంతరం చెప్పినట్లు సమాచారం. అడవిలోకి వెళ్లి పందులను వేటాడొద్దని హెచ్చరించిన మేనేజర్, ఎలక్ట్రిషన్ పట్టించుకోలేదని మంచు మనోజ్ చెబుతున్నారు. మంచు విష్ణు సహాయకులు అడవి పందులను బంధించి తీసుకెళ్తున్న వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దీంతో అడవి పందులను వేటాడిన వారిపై చర్యలు తీసుకోవాలని నెట్టిజనులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు మంచు విష్ణు సిబ్బంది.. జల్ పల్లి అడవి నుంచి వేటాడిన అడవి పందిని తీసుకొస్తున్న వీడియోను మంచు మనోజే లీక్ చేశారనే టాక్ వస్తోంది.

ఇవి కూడా చదవండి : 

  1. ముమ్మరంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం.. ఇంటింటికి వెళ్లి అందచేస్తున్న చంద్రబాబు
  2. ఏడాది చివరి రోజు కూడా హైడ్రా కూల్చివేతలు.. ఆందోళనలో బాధితులు
  3. తాగి రోడెక్కారో అంతే సంగతి.. తెలంగాణ పోలీసులు తీవ్ర హెచ్చరికలు జారీ!!
  4. దేశంలోనే సంపన్న ముఖ్యమంత్రిగా చంద్రబాబు!… మరి రేవంత్ స్థానం?
Back to top button