
క్రైమ్ మిర్రర్,స్పోర్ట్స్ న్యూస్ :- ఉమెన్స్ వరల్డ్ కప్ లో భాగంగా భారత్ అద్భుత విజయాన్ని నమోదు చేసిన సందర్భంలో ఎన్నో రకాలుగా జట్టులో ఉన్నటువంటి మహిళలకు ప్రశంశాలతో పాటు బహుమతులు కూడా లభిస్తున్నాయి. తాజాగా గుజరాత్ కి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, ఎంపీ గోవింద్ డోలకియా ప్రపంచ కప్ విజేతగా నిలిచినటువంటి భారత మహిళా ప్లేయర్లకు స్పెషల్ గిఫ్ట్లను ఇస్తున్నట్లుగా ప్రకటించారు. మన భారత దేశంలోని ప్రతి ఒక్కరు కూడా గర్వపడేలా చేసినటువంటి ఈ అమ్మాయిలకు వజ్రాల ఆభరణాలు అలాగే ఇళ్లకు అమర్చేందుకు సోలార్ ప్యానెల్ లను గిఫ్ట్ గా ఇస్తున్నట్లుగా సంచలన ప్రకటన చేశారు. వరల్డ్ కప్ ఫైనల్లో విజయం సాధించడం మామూలు విషయం కాదు అని… ఎంతో ఉత్సాహంగా, ధైర్యంగా చివరి వరకు ఆడుకుంటూ వచ్చి గెలుపొంది ప్రతి ఒక్కరిని కూడా సంతోషంలో మునిగేలా చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.దీంతో ప్లేయర్లకు ఎంతో ఖరీదైనటువంటి డైమండ్ నెక్లెస్లు బహుమతిగా ఇవ్వడం అనేది మామూలు విషయము కాదు. అయినా కూడా ముందుకొచ్చి ఇలా బహుమతులు ఇవ్వడం పట్ల ప్రతి ఒక్కరు కూడా అతనిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇప్పటికే ఫైనల్ లో గెలిచినటువంటి మన భారతీయ మహిళలకు పలువురు ప్రముఖ వ్యక్తులు ప్రశంసలు కురిపించారు. మరోవైపు వరల్డ్ కప్ నెగ్గడంతో భారత మహిళల జట్టుకు మొత్తంగా 93 కోట్ల ప్రైజ్ మనీ దక్కింది.
Read also : స్టీల్ కంపెనీని ప్రారంభించిన ఎమ్మెల్యే వీరేశం!
Read also : Paddy Procurement: ఓవైపు వానలు.. మరోవైపు మిల్లర్ల అలసత్వం.. అన్నదాతల అరిగోస!
				
					
						




