
క్రైమ్ మిర్రర్, సినిమా న్యూస్ :- టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం ఒక హీరోయిన్ వరుస సినిమాలతో దూసుకుపోతుంది. వయసు తక్కువైన… సినిమాలు మాత్రం తీసుకుంటూ పోతుంది. పేరు తక్కువ… మ్యాటర్ ఎక్కువ అన్నట్లు ఈ హీరోయిన్ టాలీవుడ్ లో పెద్ద హీరో, చిన్న హీరో అని తేడా లేకుండా నటిస్తూ వెళ్తున్నా హీరోయిన్ ఎవరో కాదు.. తనే శ్రీ లీల. ప్రస్తుతం శ్రీ లీలా హిట్లు, ఫ్లాప్ తో సంబంధం లేకుండా సినిమా ఇండస్ట్రీలో తన హవాని నడిపిస్తూ ఉంది. పెళ్లి సందడి అనే సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఈ యువ హీరోయిన్ ధమాకా, భగవంత కేసరి లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలను ఖాతాలో వేసుకున్నారు. ఆ తర్వాత వచ్చినటువంటి స్కంద, ఆది కేశవ, ఎక్స్ట్రార్డినరీ మ్యాన్, గుంటూరు కారం, జూనియర్, మాస్ జాతర వంటి సినిమాలు అంతగా అలరించలేకపోయాయి. ఇప్పటివరకు పది చిత్రాలకు పైగా నటించిన ఈ హీరోయిన్ శ్రీలీలా కు సక్సెస్ రేట్ 30% మాత్రమే ఉంది. కానీ ప్రస్తుతం శ్రీ లీల మరో నాలుగు సినిమాల్లో నటిస్తూ ఉన్నారు. డైరెక్టర్లు కూడా ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా ట్రెండింగ్ లో ఉంది కదా అని చెప్పేసి శ్రీ లీలను ప్రతి సినిమాలో హీరోయిన్ గా అవకాశాలు ఇస్తున్నారు. దీంతో కేవలం హిట్లు మరియు ఫ్లాప్ తో సంబంధం లేకుండా వరుస సినిమాల్లో దూసుకుపోతున్న ఏకైక హీరోయిన్గా శ్రీ లీలా నిలిచింది.
Read also : హైదరాబాద్‌లో డ్రగ్స్ రాకెట్…. డాక్టర్ ఇంట్లో డ్రగ్స్ దందా
Read also : హఠాత్తుగా వర్షాలు… కోలుకోలేకపోతున్న ప్రజలు!





