క్రైమ్ మిర్రర్,ఆంధ్రప్రదేశ్:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాన్వాయ్ తాజాగా ప్రమాదానికి గురైంది. పవన్ కళ్యాణ్ ను పికప్ చేసుకోవడానికి విశాఖపట్నంలోని సిరిపురం నుంచి పెద్ద వాల్తేరు వెళ్తుండగా దారి మధ్యలో కాన్వాయ్ లోని ఓ వాహనం సడన్ బ్రేక్ వేయడంతో ఒకదానికొకటి ఢీకొనడం జరిగింది. ఈ ఘటన చోటు చేసుకున్న సమయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లేకపోవడంతో ఎటువంటి ప్రమాదం జరగలేదు. ఈ కాన్వాయ్ ప్రమాదం ఘటనలో చివరి వాహనం బాగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. అలాగే కాన్వాయ్ లోని ప్రతి కారులో ఉన్నటువంటి అధికారులకు ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అధికారులు అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత మొట్టమొదటిసారిగా అతని కాన్వాయ్ కు ప్రమాదం చోటుచేసుకుంది. పవన్ కళ్యాణ్ కాన్వాయ్ ప్రమాదం జరిగింది అని తెలియగానే పవన్ కళ్యాణ్ అభిమానులు అందరూ కూడా ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. కానీ ఆ కాన్వాయ్ ప్రమాదం చోటు చేసుకున్న సమయంలో పవన్ కళ్యాణ్ లేకపోవడంతో ప్రతి ఒక్కరు కూడా ఊపిరి పీల్చుకున్నారు. దీంతో ఈ కాన్వాయ్ ప్రమాదం రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ అవుతుంది. కాన్వాయ్ లోని ప్రతి కారులోని డ్రైవర్ కాస్త ముందుచూపుతో డ్రైవింగ్ చేయాలి అని పవన్ కళ్యాణ్ అభిమానులు సూచిస్తున్నారు.
అల్లు అర్జున్ అంటే నాకు పిచ్చి : హార్దిక్ పాండ్యా
అరటి ధరలకు రెక్కలొచ్చాయి.. గెల ఎంతో తెలుసా..?
