Sunday, February 15, 2026
Homeతెలంగాణయాదాద్రి భువనగిరి జిల్లాలో ఆరు మున్సిపాలిటీల్లో కాంగ్రెసు పార్టీ విజయఢంకా మోగించింది : బీర్ల ఐలయ్య

యాదాద్రి భువనగిరి జిల్లాలో ఆరు మున్సిపాలిటీల్లో కాంగ్రెసు పార్టీ విజయఢంకా మోగించింది : బీర్ల ఐలయ్య

క్రైమ్ మిర్రర్,ఆత్మకూరు:- యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగిన ఎన్నికల్లో ఆరు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ విజయ ఢంకా మోగించిందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మెల్యే డిసిసి అధ్యక్షులు బీర్ల అయిలయ్య అన్నారు. ఆలేరు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా పాలన ద్వారా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు మరింత చేరువైందన్నారు.జిల్లాలోని అన్ని చైర్మన్ స్థానాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడం ఇందుకు నిదర్శనం అన్నారు. గతంలో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో జిల్లాలో అత్యధిక స్థానాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్న విషయం గుర్తు చేశారు. రాబోయే జెడ్పిటిసి ఎంపిటిసి ఎన్నికల్లో కూడా ఇది పునరావృతం అవుతుందన్నారు.సామాజిక పొందుకలో కొందరికి సీట్లు రానివారు అధైర్య పడాల్సిన పని లేదన్నారు.మార్కెట్ కమిటీ పిఎసిఎస్ కార్పొరేషన్లులలో నామినేట్ పోస్టులలో వారికి అవకాశం ఉంటుందన్నారు. బిఆర్ఎస్ పార్టీ బిజెపికి లోపాయికారిగా సహకరించడం వల్లే యాదిరిగుట్టలో ఆ రెండు సీట్లు బిజెపికి వచ్చాయి. కేవలం ఒకే ఒక సీటు బీఆర్ఎస్ పరిమితమైందన్నారు.

మంత్రి పదవి ఇస్తే ఓకే.. లేదంటే సీఎం అవ్వడానికి సిద్ధం : రాజగోపాల్ రెడ్డి

ఆలేరులో 54 శాతం ఓట్లు కాంగ్రెస్ పార్టీ వైపు వస్తే బీఆర్ఎస్ కు కేవలం 34 శాతం ఓట్లే వచ్చాయని 20 శాతం ఓట్లతో కాంగ్రెస్ చాలా ముందున్న విషయం ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాల వల్ల ప్రజా ప్రభుత్వం ప్రజ పాలన ద్వారా ప్రజల మన్ననలు పొందుతుందన్నారు. ఆలేరులో కాంగ్రెస్ పార్టీని ఓడించేందుకు మాజీ ఎమ్మెల్యేలు గొంగిడి సునీత మహేందర్ రెడ్డి,బూడిద బిక్షమయ్య గౌడ్, కల్లూరు రామచంద్రారెడ్డిలు ఎన్ని కుయుక్తులు పన్నిన ప్రజలు మూడు సీట్లకు పరిమితం చేశారన్నారు. గొంగిడి మహేందర్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి బిఆర్ఎస్ క్లీన్ షిప్ చేస్తుందని ప్రగల్బాల్ పలికారు రెండు మున్సిపాలిటీల్లో కేవలం నాలుగు స్థానాలకు నీ పార్టీనీ పరిమితం చేశావెందుకు అని ప్రశ్నించారు. కమ్యూనిస్టులు కాంగ్రెస్ ధైర్యంగా ప్రజల ముందుకు వెళ్లి 16 స్థానాలు కైవసం చేసుకుందన్నారు. బిజెపికి అవయవ దానం చేసి నాలుగు స్థానాలు గెలిపించవన్నారు.ధైర్యం ఉంటే బిజెపి బిఆర్ఎస్ కలిసి పోటీ చేయొచ్చు కదా అని ఎద్దేవా చేశారు. రెండు మున్సిపాలిటీల్లో 24 స్థానాల్లో 67% కౌన్సిలర్లుగా కాంగ్రెస్ వైపు నుండి గెలిస్తే బిజెపి బీఆర్ఎస్ చీకటి ఒప్పందం చేసుకొని కూడా 33 శాతానికి కౌన్సిలర్లుగా ఎనిమిది సీట్లకు పరిమితమయ్యారని బిఆర్ఎస్ కనీస పోటీ ఇవ్వలేకపోయింది అన్నారు.యాదగిరిగుట్ట ఆలేరులో ఓటేసి గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు చెప్పారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మహిళా కార్పొరేషన్ చైర్పర్సన్ బండ్రు శోభారాణి భాస్కర్,పిసిసి ప్రధాన కార్యదర్శి జనగామ ఉపేందర్ రెడ్డి,ఎంఏ ఏజాస్,ఎండీ బాబా,మండల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Corporator Deeplanayak: అనునిత్యం ప్రజల్లో ఉంటా.. ప్రజా సమస్యలను పరిష్కరిస్తా: దీప్లా నాయక్

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments