-
కంటి, చేతుల పై తీవ్రగాయాలు
-
పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు
రాజన్నసిరిసిల్ల, క్రైమ్ మిర్రర్ : అగన్వాడీ టీచర్ చిన్నారిపై దారుణంగా కర్కశత్వంగా ప్రవర్తించిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకుంది. ఎల్లారెడ్డి పేట మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన కొంపెల్లి లక్ష్మీ, విజయ్ కుమార్ తన కుమారుడు విద్యాన్ష్ ను అంగన్వాడీ కేంద్రంలో వదిలేసి పనులకు వెళ్లారు.
కాగా బాలుడు అల్లరి చేస్తున్నాడని అగన్వాడీ టీచర్ రాణి చితక బాదింది. దీంతో కన్ను, చేతిపై గాయాలయ్యాయి. భయంతో వణికిపోతన్న బాలుడి తల్లిదండ్రులకు విద్యాన్ష్‌కు జ్వరం వచ్చిందని ఫోన్ చేసి తెలుపగా అగన్వాడీ కేంద్రానికి వెళ్లిన తల్లిదండ్రులు షాక్ గురయ్యారు.
దీంతో వెంటనే బాలుడిని చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాలుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు అగన్వాడి టీచర్ పై కేసు నమోదుచేసి దర్యాప్తుచేస్తున్నట్లు తెలిపారు.









