తెలంగాణ

మంత్రి ఉత్తంపై మంత్రి కోమటిరెడ్డి అనుచరుడి విమర్శలు

ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ లో అసమ్మతి క్రమంగా తీవ్రమవుతోంది. ఇప్పటితే ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న జిల్లాకు చెందిన మంత్రులను బహిరంగ సభల్లోనూ కడిగి పారేస్తున్నారు. జిల్లాలోని ఇద్దరు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మధ్య కూడా గ్యాప్ పెరుగుతోందని తెలుస్తోంది. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రధాన అనుచరుడు ఓ సభలో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తల ముందే చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. మంత్రి ఉత్తమ్ పని తీరు సరిగా లేదంటూ ఆయన బహిరంగంగానే కామెంట్ చేయడం జిల్లా కాంగ్రెస్ లో కాక రేపుతోంది.

నల్గొండ జిల్లాలో వడ్ల కొనుగోళ్లలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రధాన అనుచరుడు కాంగ్రెస్ పార్టీ నల్గొండ పట్టణ అధ్యక్షులు గుమ్మల మోహన్ రెడ్డి అన్నారు. సివిల్ సప్లై శాఖా మంత్రి గా మన మంత్రే ఉన్నా వరి ధాన్యం కొనకపోవడం దౌర్భాగ్యం అని కామెంట్ చేశారు. సివిల్ సప్లయ్ శాఖ మంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు. ఉత్తమ్ ను టార్గెట్ చేస్తూ కోమటిరెడ్డి అనుచరుడు కాంగ్రెస్ సభలోనే కామెంట్లు చేయడం చర్చగా మారింది. ఆరు గ్యారంటీల హమీలపైనా కోమటిరెడ్డి ప్రధాన అనుచరుడు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పుట్టుకొస్తుందని వ్యాఖ్యానించారు.

4000 పెన్షన్ పై ఏం చెప్పాలో అర్థం కావడం లేదని మోహన్ రెడ్డి అన్నారు. ఇలా అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి భారీ నష్టం అంటూ వ్యాఖ్యానించారు. జనాల్లో తిరగలేకపోతున్నామంటూ ఆవేదన వెలిబుచ్చారు నాయకులు. నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బీసీ కులగలను పై జరిగిన సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ నాయకులు

మరిన్ని వార్తలు చదవండి .. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button